RGV: 29 మంది చనిపోతే అప్పుడు చట్టం గుర్తుకు రాలేదా… మరో సంచలన ట్వీట్ చేసిన వర్మ!

RGV: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అభిమాని మరణించడంతో ఈ విషయం కాస్త తెలుగు రాష్ట్రాలలో ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది. ఈ విధంగా అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని అందుకు కారణం అల్లు అర్జున్ కావడంతోనే తనపై చర్యలు తీసుకుంటున్నాము అంటూ పోలీసులు ఆయనని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా అల్లు అర్జున్ అరెస్టు కావడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందిస్తూ అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును కూడా తప్పుపట్టారు. ఈ క్రమంలోనే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం వరుసగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కుమార్ మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతుంది.

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ A11 ముద్దాయిగా ఉన్నారు అలాంటిది ఆయననీ అరెస్టు చేయడం భావ్యం కాదని తెలిపారు.అలాగే సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని వర్మ గుర్తుచేశారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. అల్లు అర్జున్ అభిమాని రేవతి కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది అయితే ఆ పేరుతో మరొక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బన్నీ అరెస్ట్‌ గురించి చేసిన కామెంట్లు కూడా అభ్యంతరంగా ఉన్నాయని వర్మ అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు అయితే గతంలో 29 మంది అమాయకులు పుష్కరాలలో బలి అయ్యారు ఆ సమయంలో చట్టం గుర్తుకు రాలేదా అంటూ ఈయన పరోక్షంగా గోదావరి పుష్కరాలను టార్గెట్ చేస్తూ పోస్టులు చేశారు. ఇలా బ్రహ్మోత్సవాలు, పుష్కరాల తొక్కిసలాటలో చనిపోతే దేవుళ్లను అరెస్టు చేస్తారా? రాజకీయ సభలో ర్యాలీలలో చనిపోతే రాజకీయ నాయకులను అరెస్టు చేస్తారా అంటూ వరుసగా పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.