Revanth Reddy: కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించి మంచి విజయాన్ని అందించాలని తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ తన వద్ద ఉందని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు.
కొత్త సంవత్సరంలో నేను మారాను మీరు కూడా మారండి ప్రజలలో తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకోండి. ఇక ప్రజలలోకి ఆరు గ్యారెంటీలను తీసుకువెళ్లండి అంటూ కొన్ని సూచనలు చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు వర్గ విభేదాలను పక్కనపెట్టి మీ పనితీరును మెరుగుపరుచుకోండి. కార్యకర్తలందరికీ కూడా ఎప్పటికీ అందుబాటులో ఉండాలి అంటూ రేవంత్ రెడ్డి సూచించారు.
ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ తన దగ్గర ఉందన్నారు. ఎవరు ఏం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? లేదా? అన్న విషయాలపై తన దగ్గర పూర్తి సమాచారం తన దగ్గర ఉందని తెలిపారు. అయితే 6 గ్యారంటీలను ప్రజలలోకి తీసుకువెళ్లడంలో కొంతమంది ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇలాగే కనుక ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలలో ఘోర వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
ప్రస్తుతం మన పార్టీకి ఈ స్థానిక సమస్థ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యం వర్గ విభేదాలను పూర్తిగా పక్కన పెట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అందరితో మమేకం అవుతూ మంచి విజయాన్ని అందుకోవాలి. తాను కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. త్వరలో కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు ఉంటాయని కొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.