రేవంత్ రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారని రేవంత్ భార్య గీత ఆరోపించారు. అసలు ఈ సంఘటనను చూసిన తర్వాత తెలంగాణలో ప్రభుత్వం ఉందా అని అనిపిస్తోందన్నారు. టెర్రరిస్టులను ఈడ్చుకెళ్లినట్టు తన భర్తను దౌర్జన్యంగా తీసుకెళ్లారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొడంగల్ ప్రజలు సంయమనం పాటించాలన్నారు. ఎవరు కూడా హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని ఈ ప్రభుత్వానికి ఓటుతో బుద్ది చెప్పాలని ఆమె ప్రజలను కోరారు. మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఊరుకోబోమని, సీఎం కేసీఆర్ ఓటమి భయంతోనే దాడులు చేయిస్తున్నారని ఆమె అన్నారు. రేవంత్ భార్య గీతారెడ్డి మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.