Revanth Reddy: అల్లు అర్జున్ విషయంలో యూటర్న్ తీసుకున్న రేవంత్ రెడ్డి.. అదే కారణమా?

Revanth Reddy: అల్లు అర్జున్ వివాదంపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పట్ల చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై ఎంతోమంది కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అల్లు అర్జున్ తప్పు చేసారనే ధోరణిలో మాట్లాడారు. అయితే తాజాగా అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది.

ఇకపై అల్లు అర్జున్ గురించి ఏ ఒక్కరు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని ఈయన కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ తెలంగాణ సర్కార్ చాలా పర్సనల్ గా తీసుకొని మరి ఈ విషయంపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు .దీంతో అల్లు అర్జున్ కి సంబంధించి రోజుకొక వార్త వెలుగులోకి వస్తుంది ప్రస్తుతం బెయిలు మీద ఉన్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పోలీస్ విచారణలో పాల్గొన్నారు.

ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ గురించి మాట్లాడుకూడదు అంటూ కీలక ఆదేశాలు జారీ చేయడం వెనుక గల కారణం ఏంటి అనేది తెలియకపోయినా అల్లు అర్జున్ గురించి తరచూ మాట్లాడితే కనుక అతడికి పొలిటికల్ మైలేజ్ వస్తుందనే కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతడి గురించి మాట్లాడకపోవడమే మంచిదని ఏదైనా ఉంటే చట్టమే చూసుకుంటుందని కొందరు సలహాలు ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఇక అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగడంతో కొందరు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేస్తున్నటువంటి వారిలో కొడంగల్ వాసులు ఉన్నారని బిజెపి ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు కూడా వస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ ఈ కేసు ఘటన ఎలాంటి మలుపులు తిరుగుతుంది ఎక్కడ ఈ కేసుకు పులి స్టాప్ పడుతుందనేది తెలియాల్సి ఉంది