Revanth Reddy:: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజా పాలన విజయోత్సవాలు పేరిట రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా పెద్దపల్లిలో యువ వికాసం పేరిట ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువకుల గురించి మాట్లాడుతూ కామెంట్లు చేశారు. ఈ విషయంపై ఈయన సోషల్ మీడియా వేదికగా కూడా ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..నిరుద్యోగంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. మొన్న కొలువులే ఆలంబనగా.. ఉద్యమం కొలిమిలా మండిందని, నిన్న కొలువులే ఆకాంక్షగా.. తన రణం జంగ్ సైరనై మోగిందని గుర్తు చేశారు. నేడు కొలువుల కలలు నిజమైన క్షణం.. ప్రజా పాలనలో యువ వికాస వసంతం అని, ఏడాదిలో 55 వేల ఉద్యోగ నియామకం అని ట్వీట్ చేశారు.
తరచూ నోటిఫికేషన్లో తోరణం..ఏడాది ప్రజా పాలనలో తగ్గుతున్న నిరుద్యోగం అని వ్యాఖ్యానించారు. ఈ సంతోషాన్ని నా ఆనందాన్ని నా యువకులతో ఈ ఆనందాన్ని పంచుకోవడం కోసం పెద్దపల్లి వస్తున్నాను అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. మెగా డీఎస్సీతో పాటు గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇలా ఏడాది పాలనలో వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నిరుద్యోగాన్ని తగ్గించామని రేవంత్ తెలిపారు. ఇకపోతే ఈయన ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా విజయవంతంగా అమలు పరిచాము అంటూ ఈ విజయోత్సవ కార్యక్రమాలలో వెల్లడిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ కార్యక్రమం పై బిఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వచ్చారు.