గాంధీ భవన్లో జొర్రిన గాడిద కొడుకు… పొన్నాల ప్రవచనాలు పీక్స్!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. మోస్ట్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి, బీసీ నేత పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. పూలమ్మిన చోట కట్టేలు అమ్మలేనని చెబుతూ పార్టీకి రాజినామా చేశారు. ఈ సందర్భంగా బీసీలకు పార్టీలో సముచిత స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరోక్షంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.

దీంతో… సహనం కోల్పోయారో.. లేక, సంస్కారం విడిచారో తెలియదు కానీ… పొన్నాలపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు రేవంత్. ఇందులో భాగంగా… “పార్టీ మారేందుకు సిగ్గుండాలి.. అయినా, సచ్చేముందల పార్టీ మారడం ఏంటి..?” అంటూ పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వయసుకైనా మర్యాద ఇవ్వాలనే మాటలు వినిపించాయి. ఇప్పుడు రేవంత్ పక్క పార్టీ నుంచి వచ్చి ఉన్న పదవిలాంటి పదవులు పార్టీలో పొన్నాలో ఎన్నో చూశారన్న ఇంగితమైనా ఉండి ఉండల్సింది అనే కామెంట్లూ సోషల్ మీడియా వేదికగా కనిపించాయి. రేవంత్ రెడ్డికి ఏమి చూసుకుని ఇంత బలుపు అనే మాటలు కాంగ్రెస్ నాయకులనుంచే ఆఫ్ ద రికార్డ్ వినిపించిన పరిస్థితి.

ఈ సమయంలో తనపై రేవంత్ చేసిన కామెంట్లపై పొన్నాల రియాక్ట్ అయ్యారు. ఇంతకాలం నొప్పింపక, తానొవ్వక అన్నట్లుగా కనిపించిన లక్ష్మయ్య ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నిప్పులు కక్కారు. ఇందులో భాగంగా… గాంధీ భవన్లో జొర్రిన గాడిద కొడుకు అంటూ మొదలుపెట్టిన ఆయన… కాంగ్రెస్ పార్టీని నాశనం చెయ్యడానికి వచ్చిన పాగల్ గాడు రేవంత్ పై ఓ రేంజ్ లో మండిపడ్డారు!

అనంతరం… తన చావు గురించి కూడా రేవంత్ మాట్లాడారని మొదలుపెట్టిన ఆయన… ఎవరి చావు ఎప్పుడొస్తదో ఎవరు చూశారని అన్నారు. 80 ఏళ్ళ వయసున్న మనిషిని పట్టుకొని ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా… “నువ్వసలు మనిషివా, పశువువా” అంటూ రేవంత్ పై ధ్వజమెత్తారు. “నీ తోడబుట్టినవాళ్లంతా బతికే ఉన్నారా” అని అడిగారు.

ఈ ఫ్లో కంటిన్యూ చేసిన పొన్నాల… “బిడ్డ పెళ్లిని కూడా తన అవసరాల కోసం వాడుకుని 6 కోట్ల రూపాయలు అడుక్కున్న బిచ్చగాడివి నువ్వు.. నీ మొహానికి ప్రజా సేవ అంటే తెలుసా? పైసల సేవ చేసే నువ్వు నా గురించి మాట్లాడతావా” అంటూ ధ్వజమెత్తారు పొన్నాల లక్ష్మయ్య! ఇక ఇప్పుడున్న టీపీసీసీ చీఫ్ పదవి కూడా 50 కోట్ల రూపాయలు అధిష్టానానికి కప్పం చెల్లించి పీసీసీ పదవి తెచ్చుకున్నాడంటూ మండిపడ్డారు.

ప్రస్తుతం రేవంత్ పై పొన్నాల చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకాలం ఎవరూ చేయని విమర్శలు చేయడంతో ఇవి విపక్షాలకు వరాలుగా మార్చే అవకాశాలున్నాయని అంటున్నారు.