Revanth Reddy: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి అయితే ఈ ఎన్నికల ఫలితాలలో భాగంగా మహాయుతి కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇలా కూటమి గెలవడంతో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కూటమి అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి పరిపాలన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి ఏడాది పాటు పరిపాలన అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ఎన్నికలలో భాగంగా ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. అయితే రేవంత్ రెడ్డి ఏ ఏ ప్రాంతాలలో పర్యటన చేశారో ఆయా ప్రాంతాలలో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలు కావటం నిజంగా రేవంత్ రెడ్డికి అవమానమే అని చెప్పాలి.
ఈ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలో ఈయన ఐదు గ్యారెంటీలను ప్రజల ముందుకు తీసుకు వెళుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ పరిపాలన తీరు చూసిన మహారాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా వీరి మాటలను నమ్మి ఓట్లు వేయలేదని తెలుస్తుంది.
రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎన్నికల ముందుకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ అమలులో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. ఇలా ఇక్కడ పథకాలను అమలు పరచని ఈయన మహారాష్ట్ర వెళ్లి మరోసారి ఐదు గ్యారెంటీ పథకాలను చెప్పడంతో అక్కడ ప్రజలు ఎవరు కూడా రేవంత్ మాటలను పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. దీంతో ఓటు రూపంలో కాంగ్రెస్ కి బాగా బుద్ధి చెప్పారని ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.
ఇక రేవంత్ ప్రచారం చేసిన ప్రతిచోట ఓడిపోవడంతో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి పాలన పై బీఆర్ఎస్ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలోనూ ముందు ముందు రేవంత్ రెడ్డికి గడ్డు పరిస్థితి ఎదురవుతుందని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని మహారాష్ట్ర ఫలితాలు తెలియజేస్తున్నాయి.