2019 ఎప్పటికీ 2014 కాదు. గత నాలుగేళ్ల తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఏన్నోరకాల ఆశలు చూపి టిడిపి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకున్నారు. లోకల్ గా అంతో ఇంతో బలమున్న వాళ్లకు మంత్రిపదవులిచ్చారు. వాళ్లు గతంలో తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వారైనా సరే క్యాబినెట్ లో సీటిచ్చి గౌరవించారు.
అపుడు నష్టపోయినా కాంగ్రెస్ ఇపుడు వడ్డీతో సహా లాక్కోవాలనుకుంటున్నది. మొన్నా మధ్య సిటింగ్ ఎమెల్యే కొండా సురేఖ కాంగ్రెస్ లోకి వచ్చారు. లెక్కలేనంత మంత్రి మాజీ ఎమ్మ్యెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చారు. నిన్న రాష్ట్రంలో పెద్దసంచలనం సృష్టిస్తూ, తెలంగాణాలో నిజాయితీ పరుడిగా, సీరియస్ పొలిటిషన్ గా పేరు తెచ్చుకున్న కొండా విశ్వేశ్వరెడ్డి కెసియార్‌కు, ఆయన పార్టీ కి గుడ్ బై కొట్టి వెళ్లిపోయారు. రూలింగ్ పార్టీ నుంచి ఒక సిటింగ్ ఎంపి, అందునా కొండా లాంటి వ్యక్తి వెళ్లిపోవడం పెద్ద దెబ్బ. దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎమ్మెల్యేలను కోల్పోయి, బాగా నష్టపోయిన కాంగ్రెస్ ఎన్నికల ముందుకు టిఆర్ ఎస్ ఎంపిలను లాక్కునే ప్రయత్నం ముమ్మరంచేసింది. ఇందులో భాగంగా చాలా మంది సిటింగ్ ఎంపిలతో పార్టీ టచ్ లో ఉంది. అదేవిధంగా పార్టీ ఎంపిలు చాలామంది టిఆర్ఎస్ తో అయిష్టంగా ఉంటున్నారు. కారణం, కొండవిశ్వేశ్వరెడ్డి చెప్పినవి, ‘వ్యక్తిగతం, పార్టీలోగుర్తింపు లేకపోవడం, నియోజకవర్గంలో అభివృద్ధి వారాశించినట్లు లేకపోవడం’ అంటున్నారు.
మరొక నలుగురు ఎంపిలు రావచ్చని మీడియాలో వార్తలొస్తున్నాయి. నలుగురెపుడొస్తారోగాని మరొక ఇద్దరయితే గ్యారంటీ అని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, కోడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అంటున్నారు. దానికి ఆయన డిసెంబర్ 7 డెడ్ లైన్ కూడా పెట్టారు.
‘ డిసెంబరు 7 లోపు మరొక వికెట్లు పడటం ఖాయం. కాంగ్రెస్ ది ప్రజాకూటమి కేసీఆర్‌ది కుటుంబ కూటమి. ఆ కూటమిలో ఉండలేకపోతున్న వాళ్లు వెళ్లిపోతున్నారు. గత ఎన్నికల్లో భావోద్వేగంతో కేసీఆర్ గెలిచారు. ఈ సారి వందకు సున్నా మార్కులే. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన మానవతామూర్తి సోనియా. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో నాకు తెల్వదు. తెలంగాణ ఇచ్చిన తల్లి ఇప్పుడు తెలంగాణకు కదిలి వస్తున్నది,’ అని ఆయన మేడ్చెల్ లో అన్నారు.
డిసెంబర్ 7 లోపే ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో, ఆ రోజు విశేషమేమిటో రేవంత్ చెప్పలేదు. చెబుతారేమో చూద్దాం.