మంత్రి జూపల్లిని ఫిదా చేసిన రేవంత్ (వీడియో)

తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం కొడంగల్ లో పర్యటించారు. హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కొడంగల్ లోని అన్ని మండలాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశమందిరంలో పెద్ద రగడ జరిగింది. బ్యానర్ మీద మంత్రి జూపల్లితోపాటు పట్నం మహేందర్ రెడ్డి పేరు, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి పేరు ఉన్నాయని, స్థానిక ఎమ్మెల్యే అయిన తన పేరు ఎందుకు లేదని రేవంత్ అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

అయితే అధికారులు తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. బ్యానర్ ఉంటే రేవంత్ వదిలేలా లేడన్న ఉద్దేశంతో బ్యానర్ ను పీకి బయట పడేశారు. అయితే బ్యానర్ లేకుండానే సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ సభలో మాట్లాడుతూ ఇదెక్కడి పద్ధతి అని మంత్రిని సున్నితంగానే ప్రశ్నించారు. అంతేకాకుండా మంత్రి జూపల్లిని ఫిదా చేసేలా మాట్లాడారు. అదే సమయంలో అధికారులపై విరుచుకుపడ్డారు.

రేవంత్ ఏమన్నారో కింద వీడియో ఉంది చూడండి.