అల్లు అరవింద్ వర్సెస్ దిల్ రాజు.! టాలీవుడ్‌లో ఇదేం రాజకీయం.?

ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు మధ్య పెద్ద యాగీ జరిగిందంటూ తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద రచ్చే జరుగుతోంది. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారుగానీ.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు.

సినిమా రంగం అన్నాక.. చిన్నా చితకా వ్యవహారాలు ఇలాంటివి వుంటాయి. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించే సినిమా విషయమై ఇద్దరు నిర్మాతల మధ్య నడుస్తున్న గలాటా ఇది. విషయం ఓ కొలిక్కి వచ్చిందా.? తుపాను ముందర ప్రశాంతతా.? అన్నది తెలియరాలేదు.

ఇదిలా వుంటే, ఈ వివాదాన్ని బేస్ చేసుకుని.. రాజకీయం కూడా రచ్చ చేయడానికి సిద్ధమైందట. తెలంగాణలోని అధికార పార్టీ దిల్ రాజుకి అండగా నిలబడిందని అంటున్నారు. మరోపక్క, అల్లు అరవింద్ విషయంలో రాజకీయ ప్రమేయం ఎటువైపు నుంచి.? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

అసలు ఈ స్థాయిలో రాజకీయాలకు సినీ రంగం ఆస్కారమిస్తుందా.? అంటే, సినిమాల్నీ.. రాజకీయాల్నీ విడదీసి చూడలేం మరి. ఓ హై ప్రొఫైల్ పొలిటీషియన్ రంగ ప్రవేశంతోనే అల్లు అరవింద్ వెనక్కి తగ్గారన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న గాసిప్.

‘అబ్బే, ఆ ఆస్కారమే లేదు..’ అంటున్నాయి అటు దిల్ రాజు క్యాంప్.. ఇటు అల్లు అరవింద్ క్యాంప్. ఇంత వివాదానికి కారణమైన పరశురామ్ మీదా, హీరో విజయ్ దేవరకొండ మీదా.. సినీ వర్గాల్లో సెటైర్లు పడుతున్నాయి.