Narendra Reddy: రేవంత్ నీ పతనం కొడంగల్ నుంచి మొదలవుతుంది.. పట్నం నరేందర్ రెడ్డి వార్నింగ్!

Narendra Reddy: తెలంగాణ వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రాంతంలో కథ కొద్దిరోజులుగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుని ముఖ్యంగా లగచర్ల గ్రామంలో ఫార్మ కంపెనీ ఏర్పాటు కోసం అధికార ప్రభుత్వం చర్యలు చేపట్టగా అక్కడి గ్రామస్తులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. పచ్చని పంటలు పండే భూములను లాక్కోవడం భావ్యం కాదని తమ భూములు ఇవ్వడానికి అనుకూలంగా లేరని రైతులు వెల్లడించారు. అయినప్పటికీ అధికారులు అక్కడికి వెళ్లడంతో అధికారులపై దాడి చేశారు ఈ దాడి ఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనగా మారింది.

ఈ క్రమంలోనే ఈ దాడి వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇలా నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం పట్ల బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపించింది. ఇకపోతే తాజాగా ఈయనని కోర్టుకు హాజరుపరచగా న్యాయస్థానం కూడా పోలీసులు తీరుపై అలాగే ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

పట్నం నరేందర్ రెడ్డిని ఓ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు చేయడం ఏంటి అంటూ ప్రశ్నించింది. కెబిఆర్ పార్కు వద్ద వాకింగ్ కోసం వెళ్లిన ఈయనని ఒక తీవ్రవాది లాగా అరెస్టు చేయడం సరైన విధానం కాదు అంత అవసరం ఏమొచ్చిందని పోలీసుల తీరుపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొడంగల్ కోర్టుకు హాజరైన పట్నం నరేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.

రైతులకు మద్దతుగా నిలబడితే నామీద అక్రమ కేసులు పెట్టి జైలులోకి వేశారు. అక్రమంగా నన్ను అరెస్టు చేయించిన రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుంచి మొదలు అంటూ ఈయన శపథం చేశారు. కొడంగల్ ప్రాంతంలోనే తనని ఘోరంగా ఓడిస్తాను అంటూ నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.