తెలంగాణ:దుబ్బాక మరియు గ్రేటర్ ఎన్నికలలో దారుణ పరాభవం తరువాత ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ ఛీప్ పదవికి రాజీనామాతో ఆ పదవి ఖాళీగా ఉంది . ఈ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ లోని సీనియర్లు అధిష్టానం వద్ద పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయ సేకరణ ఎత్తుగడ వేసి వేసింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ ఇటీవలే హైదరాబాద్లో మకాం వేసి కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ నివేదిక అధిష్టానానికి సమర్పించారు. టీపీసీసీపై ఎవరీకైనా అభ్యంతరాలుంటే అధిష్టానానికి చెప్పుకోవచ్చని తెలియజేశారు.
టీపీసీసీ చీఫ్ ఎంపిక చివరి దశకు చేరుకోవడంతో నేతలంతా ఢిల్లీకి పయనమవుతున్నారు. టీపీసీసీ పదవి ఎంపీ రేవంత్ రెడ్డికి దక్కటం ఖాయం అని అనుకుంటున్నా తరుణంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.రాహుల్ గాంధీతో ఎంపీ రేవంత్ రెడ్డి భేటి కానుండగా మరోవైపు సోనియాగాంధీతో కోమటిరెడ్డి భేటి కానున్నట్లు తెలుస్తోంది. రాహుల్ టీపీసీసీని రేవంత్ కు కట్టబెట్టాలని చూస్తుండటంతో కోమటిరెడ్డిని సోనియాతో భేటి అయ్యేందుకు ఢిల్లీకి వెళుతున్నారు.
టీపీసీసీ కాంగ్రెస్ నేతకే ఇవ్వాలని బయటి నుంచి వచ్చిన నేతలు పార్టీలో ఎన్నిరోజులు ఉంటారో తెలియదని సోనియాకు కోమటిరెడ్డి వివరించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో బండి సంజయ్ కు ఇచ్చినట్టే కాంగ్రెస్ లోనూ పార్టీ మనిషికే టీపీసీసీ ఇవ్వాలని కోమటిరెడ్డి కోరుతున్నారు.తాను ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నానని.. టీపీసీసీ ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తానని.. చెప్పారు. పీసీసీ పదవని తాను ఆశించడంలో తప్పేమిలేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానిస్తున్నాడు. మరి హై కామాండ్ పదవిని ఎవరికి అప్పగిస్తుందో మరి కొద్దీ రోజుల్లో తేలిపోతుంది. ఈ వ్యవహారం తరువాత తెలంగాణా కాంగ్రెస్ లో చాలా మార్పులు ఉండబోతున్నాయని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.