కాంగ్రెస్ కమిటీల్లో బ్రోకర్ నా కొడుకులకే చోటు : కోమటిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీల నియామకంపై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. గాంధీభవన్ లో తిరిగే బ్రోకర్లందరికీ, టివిలు, పేపర్లలో మాట్లాడే వారికి కమిటీల్లో స్థానం కల్పించారని ఆరోపించారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో సంచలన విమర్శలు చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన తన అనుచరులు, ముఖ్య నాయకుల సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో కింద చదవండి. 

కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీకి అవసరమా? లేదా కాంగ్రెస్ తేల్చుకోవాలి. కాంగ్రెస్  పార్టీ ప్రజల్లో తిరిగే నాయకులకు స్థానం కల్పించకపోవడం దుర్మార్గం. రామచంద్ర కుంతియా తెలంగాణకు శనిలా తయారైండు. డైరెక్టుగా కుంతియాకు తాను ఫోన్ చేసిన. ఏనుంచి వచ్చినవురా అయ్యా నువ్వు.. తెలంగాణకు శనిలాగా తయారైనావేందిరా అని నిలదీసిన. కుంతియాకు నేను భయపడాల్నా? ఇలాంటి కుంతియాలు వంద మంచి వచ్చినా నేను భయపడను.

బ్రోకర్ నా కొడుకులందరికీ ఎందుకు కమిటీల్లో చోటు కల్పించారని కుంతియాను అడిగిన. కుంతియాకు నేను భయపడాల్నా నేను ఎవరికీ భయపడను. నాలాంటి వాళ్లను ఎందుకు ఇంట్లో కూసోబెడుతున్నారు. ప్రజలు ఎవరిని కోరుకుంటున్నరు? ఎవరిని ముందు పెట్టాలి? ఎవరు తెలంగాణ కోసం పనిచేసిర్రు. వాళ్లను ముందు పెట్టాలి కానీ. ఈ బ్రోకర్ నా కొడుకులను ముందు పెడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా?

నేను ఎవరికీ తలవంచను. ఎవరికీ భయపడను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో కేసిఆర్ అధికారంలోకి వచ్చిండు తప్ప ఆయన గొప్పతనం ఏమీ లేదు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకు, గెలిచేవారికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పితే టివిల ముందు, పేపర్ల ముందు మాట్లాడే వాళ్లకు ఇస్తే రాదు.

ప్రజలు కోమటిరెడ్డి బ్రదర్స్ ను కోరుకుంటున్నరు. మీరు మాత్రం మమ్మల్ని పక్కన పెడుతున్నరు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ కు అవసరం లేదా? ఏ విషయమైనా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తిని నేను. మేము ప్రజల కోసమే బతుకుతున్నం. కాంగ్రెస్ ను బతికించాలంటే కార్యకర్తలు అందరూ ఆలోచన చేయాలి.

గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కానీ, మామూలోళ్లకు టికెట్లు ఇస్తే రాదు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రెండున్నర సంవత్సరాల నుంచి వందల సార్లు మమ్మల్ని అవమానించిర్రు. మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి వార్డు మెంబర్ గా గెలవని వ్యక్తులను కమిటీల్లో వేశారు. 

బలమైన అభ్యర్థులకు, గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలి. ఈ పైరవీ కారులందరినీ దూరం పెట్టాలని ఈ సందర్భంగా ఈ సభా ముఖంగా కుంతియాకు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి హెచ్చరిస్తున్నాను. 

కోమటిరెడ్డి మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

komatireddy rajagopal reddy comments on kuntia