కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనే అభిప్రాయాన్ని జగ్గారెడ్డి మార్చుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసే వరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తన తదుపరి కార్యచరణ కోసం సంగారెడ్డిలో పార్టీ కార్యకర్తలతో భేటీ అయిన జగ్గారెడ్డి.. పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. చివరిగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని జగ్గారెడ్డికి కార్యకర్తలు సూచించారు. ఈసారి 75 వేల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలను నమోదు చేయాలని అనుచరులు, కార్యకర్తలను జగ్గారెడ్డి కోరారు. మార్చి 21న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సంగారెడ్డిలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. తన భవిష్యత్ కార్యచరణ ఆ సభలో వెల్లడిస్తానని తెలిపారు.