TG: తెలంగాణలో ఎప్పుడు ఎవరి అరెస్టు జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం బిఆర్ఎస్ నాయకులకు నోటీసులు కూడా ఇవ్వకుండా వారిని అరెస్టు చేస్తూ జైలుకు పంపిస్తున్నారు అంటూ బిఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే త్వరలోనే కేటీఆర్ కూడా జైలుకు వెళ్తారు అంటూ ఇప్పటికే ఎంతో మంది తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ వచ్చారు..
ఈ క్రమంలోనే తాజాగా రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ అబిడ్స్‌లోని రెడ్డి బాలుర వసతిగృహ పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రీజినల్ రింగ్ రోడ్(ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మంత్రి స్పందించారు. ఆర్‌ఆర్‌ఆర్ 50% తెలంగాణను నగరీకరణ చేసేందుకు ఉపయోగపడే అద్భుతమైన ప్రాజెక్టు. 2017లోనే దాన్ని ప్రధాని ఎందుకు అంగీకారం తెలిపిన గత ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి ఈ విషయం గురించి పట్టించుకోలేదని తెలిపారు. అయితే మరో మూడు సంవత్సరాల కాలంలోనే ఈ రోడ్డు పూర్తి అవుతుందని తెలిపారు.
ఇక గత పాలకులు వారి అవసరాల కోసం రూ.7,380 కోట్లకు ఓఆర్‌ఆర్ టోల్ లీజును అమ్ముకున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ఈ వ్యవహారంపై విచారణకు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల కోరిక మేరకే సీఎం రేవంత్‌రెడ్డి దానిపై సిట్ వేశారు. అవకతవకలు జరిగితే అందుకు కారణమైన వారందరూ కూడా బయటకు వస్తారని తెలిపారు అదే విధంగా ఫార్ములా-ఈ రేసు కేసులో ఒకరో.. ఇద్దరో జైలుకు పోవడం ఖాయం అంటూ ఈయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఒకరు ఐఏఎస్ అధికారి అలాగే మరొకరు కేటీఆర్ అనీ, వీరిద్దరూ జైలుకు పోవడం ఖాయమని చెప్పకనే చెప్పారనీ తెలుస్తోంది.