వికారాబాద్ లో దారుణం.. పింఛన్ డబ్బుల కోసం ఆ వ్యక్తి చేసిన పని తెలిస్తే ఛీ కొడతారు..!

ప్రస్తుత కాలంలో డబ్బుకి ఉన్న విలువ బంధాలకు బంధుత్వాలకు లేకుండా పోయింది. డబ్బు కోసం ప్రజలు ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు.తాజాగా వికారాబాద్ లో ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. చిన్న నాటినుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న తన మనవడు పెరిగి పెద్దయ్యాక డబ్బుల కోసం వయసు పైబడిన ఆ ముసలావిడను పింఛన్ డబ్బుల కోసం వేధించిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే…వికారాబాద్‌ జిల్లా పెద్దముల్ మండలం మంబాపూర్‌లో తాగుడుకు బానిసైనా ఒక వ్యక్తి డబ్బుల కోసం తరచూ తన నానమ్మను వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆ ముసలావిడ తనకు వచ్చే పెన్షన్ డబ్బులు కూడా మనవడికి ఇచ్చేది. ఇటీవల వచ్చిన పింఛన్ డబ్బులలో సగం మనవడికి ఇచ్చింది అయినా కూడా అవి సరిపోవు అంటూ ఆ మనవడు తప్ప తాగి వచ్చి వయసు పైబడిన తన నానమ్మ మీద దారుణంగా దాడి చేశాడు. కనీసం అతనికి ఎదురు తిరగలేని స్థితిలో ఉన్న తన నానమ్మ మీద కనికరం లేకుండా కాళ్లతో తన్నుతూ ఒక పశువుల ప్రవర్తించాడు.

ఏమి చేయలేని స్థితిలో ఉన్న ఆ ముసలావిడ తన మనవడిని వేడుకుంటుంది. అయినా కూడా ఆ వ్యక్తి వినకుండా ముసలావిడ మీద విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్స్ సదరు వ్యక్తి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముసలి వయసులో ఆవిడకు అండగా ఉండాల్సిన వ్యక్తి డబ్బు కోసం ఇలా ఆమెను చిత్రహింసలు పెడుతుండటంతో అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆ ముసలావిడ దీనస్థితి చూసి గ్రామస్తులతో పాటు నేటిజన్స్ కన్నీరు పెట్టుకుంటున్నారు.