రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి దక్కితే వాళ్ళ పరిస్థితి ఏంటి ?

if Rewanth Reddy becomes the PCC president what will happen to others?

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీ నేతల పైన పోరాడుతూ, ఒకరికి పదవులు దక్కకుండా మరొకరు రాజకీయం చేస్తూ, ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని మరింత కిందకి దిగజార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు గా కనిపిస్తున్నారు. 2014 ఎన్నికల దగ్గర నుంచి వరుసగా కాంగ్రెస్ పార్టీకి అన్ని అపజయాలే ఎదురవుతున్నాయి. పార్టీని ఒక గాడిలో పెట్టే విషయంపై దృష్టి పెట్టకుండా, వివాదాలు సృష్టించుకుంటూ, అంతంతమాత్రంగా ఉన్న పార్టీని మరింత దిగజార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వ్యవహరిస్తున్నారు.

if Rewanth Reddy becomes the PCC president what will happen to others?
if Rewanth Reddy becomes the PCC president what will happen to others?

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయమై కాంగ్రెస్ లో పెద్ద కసరత్తే జరిగింది. నాయకులందరి అభిప్రాయాలను తీసుకొని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ ఢిల్లీకి వెళ్లారు. మరో మూడు రోజుల్లో కొత్త పిసిసి అధ్యక్షుడు ఎవరు అనేది తేలిపోనుంది. ఈ సమయంలోనే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులలో టెన్షన్ పెరిగిపోతుంది. మొదటి నుంచి తాము వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి దక్కితే, తమ పరిస్థితి ఏమిటనే విషయంపై వారు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి ఖరారు అయిపోయింది అని అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మాణిక్యం ఠాకూర్ చేపట్టిన అభిప్రాయ సేకరణ లో నూ రేవంత్ ఎక్కువ మంది ప్రస్తావించిన విషయం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు కంగారు పుట్టిస్తోంది.