హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం ఉదయం ఇలా కనిపించారు. రాయల్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ ను నడిపించారు. ఆయన వెనక కూర్చున్నది తెలంగాణ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్. అసదుద్దీన్ ఒవైసీ ఈ ఉదయం అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్‌తో కలిసి మీరాలం ట్యాంక్‌ను పరిశీలించారు.
అలాగే- వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఆర్డీపీ)లో భాగంగా నిర్మించ తలపెట్టిన ఫ్లైఓవర్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తన అనుచరులు తీసుకొచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ను ఒవైసీ సరదాగా నడిపించారు. `అరె బైఠో సాబ్..` అని అర్వింద్‌కుమార్ చేయి పట్టుకుని ఆప్యాయంగా బైక్ వెనకల కూర్చోబెట్టుకున్నారు. కొద్దిదూరం ప్రయాణించారు.