రేవంత్ రెడ్డి అరెస్టు పై రేవంత్ రెడ్డి కూతురు నైమిషా ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. తమ ఇంట్లోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించి తన తండ్రిని అరెస్టు చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డి అరెస్టు పై ఆయన కూతురు నైమిషా ఏమన్నారంటే…
ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో మా ఇంటికి 50 మంది పోలీసులు వచ్చారు. వారు బయట ఉన్న తలుపులు పగులగొట్టి ఏకంగా బెడ్రూమ్ లోకి వచ్చారు. ఆ సమయంలో ఆ రూములో నేను, డాడీ, మమ్మీ ఉన్నాం. పోలీసులు ఎటువంటి వారెంట్ లేకుండానే అరెస్టు చేస్తున్నామని తెలిపారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగినా కూడా చెప్పలేదు. టెర్రరిస్టులాగా గుంజుకొని పోయారు. పోలీసులు తమ ఐడి కార్డులు కూడా చూపించలేదు. ఎక్కడికి తీసుకెళుతున్నారంటే కూడా చెప్పలేదు. అతను ఎక్కడ ఉన్నాడో చెప్పాలి. ఒక్కో చానల్ లో ఒక్కో విధంగా చూపిస్తున్నారు. మాకు వెంటనే రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. నైమిషా మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాకు విడుదల చేశారు. నైమిషా మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.
రేవంత్ ను ఉదయం 3 గంటల ప్రాంతంలో అరెస్టు చేస్తున్నప్పుడు కూడా రేవంత్ కూతురు నైమిషా పలు వీడియోలు తీసి సోషల్ మీడియాకు విడుదల చేసింది. రేవంత్ ఇంట్లో జరిగిన సీన్లన్ని కూడా నైమిషా తీసిన వీడియోల ద్వారానే బయటకు వచ్చాయి. రేవంత్ ను అరెస్టు చేసే సమయంలో పోలీసులు మీడియాను లోపలికి అనుమతించలేదు.
రేవంత్ రెడ్డి కూతురు నైమిషా ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. ఆమె ఎక్కడ కూడా నోరు విప్పి మాట్లాడలేదు. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి కూతురు నైమిషా మంగళవారం మాట్లాడిన తీరు చూసి అంతా కూడా తండ్రికి తగ్గ తనయ అని అభినందిస్తున్నారు. రేవంత్ అరెస్టు సమయంలో కూడా ఆమె సంయమనం పాటించారు. నైమిషా రెడ్డి తీసిన వీడియోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
రేవంత్ అరెస్టు తర్వాత నైమిషా రేవంత్ అరెస్టు తీరును వివరిస్తూ వెంటనే తన తండ్రి ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేసిన వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. రేవంత్ రెడ్డి లాగానే నైమిషా కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతుందన్న చర్చ జరుగుతోంది. కార్యకర్తలు, నాయకులు కూడా నైమిషా వీడియో చూసి ఆమెను అభినందిస్తున్నారు.
రేవంత్ అరెస్టు సమయాన నైమిషా వీడియోలు తీస్తూ ఉన్నారు. ఆ వీడియో కింద ఉంది చూడండి.