నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్ధి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తూనే డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. నల్లగొండ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముసలి వాళ్లకు తన జేబులోనుంచి డబ్బులు తీసి ఇచ్చారు. ప్రచార రథం పై మండల నేత మాట్లాడుతుండగా వెంకట్ రెడ్డి పక్కకు నిలబడ్డారు. ఇదే సమయంలో వెంకట్ రెడ్డి దగ్గరకు కొంత మంది ముసలి వాళ్లు వచ్చి డబ్బులు అడిగారు.
వెంకట్ రెడ్డి ఇద్దరికి తన జేబులోంచి పైసలు తీసి ఇచ్చారు. ఇంతలో అక్కడికి వచ్చి మరికొంత మంది తమకు కూడా ఇవ్వాలనడంతో వెంకట్ రెడ్డి వారిని పక్కకు వెళ్లాలని సూచించారు. వెంకట్ రెడ్డి డబ్బులు పంచుతుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన కోమటిరెడ్డి పై కేసు నమోదు చేయాలని టిఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వెంకట్ రెడ్డి డబ్బులు పంచిన వీడియో కింద ఉంది చూడండి.