Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్ పై మరోసారి ఘాటుగా స్పందించిన సీఎం.. యుద్ధాలు చేశారా అంటూ?

Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్ విషయం ఇటు రాజకీయాల పరంగా కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణం అయ్యింది అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల సమయంలో ఫ్యామిలీతో కలిసి సంధ్య థియేటర్ కు వెళ్లారు. అయితే అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో రేవతి అనే అభిమాని మరణించడం ఆమె మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ అరెస్టు చేయడం సంచలనంగా మారింది.

ఇలా తొక్కిసలాటలో భాగంగా అభిమాని మరణించడంతో అల్లు అర్జున్ కు ఏ మాత్రం సంబంధం లేదని అయినప్పటికీ ఈయనని అరెస్టు చేయడంతో ఈ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంది అంటూ పెద్ద ఎత్తున ఈ విషయం రాజకీయాల పరంగా కూడా చర్చలకు కారణమవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బిఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు.

అల్లు అర్జున్ అరెస్టుకు తన ప్రమేయం ఏమాత్రం లేదని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ ఈయన అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించారు. ఇక అంతటితో ఆగకుండా మరోసారి అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఈయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన అక్కడకు వెళ్లడంతో ఒక అభిమాని మరణించింది ఒక సామాన్యుడు ప్రాణాలు కోల్పోతే అరెస్టు చేయాల్సిన హక్కు లేదా అంటూ ప్రశ్నించారు.

చట్టం ముందు అందరూ సమానులే. ఎవరూ అతీతులు కాదు. సినిమాలు తీశారు.. సంపాదించుకున్నారు. సరిహద్దుల్లో యుద్ధాలు చేశారా?.. దేశాన్ని చూసి ప్రపంచం గర్విచేలా ఏవైనా విజయాలు సాధించారా? అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇలా అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సరి కాదంటూ ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు సినీ సెలెబ్రిటీలు అభిమానులు భావిస్తున్నారు. ఇలా అల్లు అర్జున్ అరెస్టు చేయించి రేవంత్ రిస్క్ చేశారు అంటూ మరికొందరు ఈ విషయంపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.