బన్నీ వీడియో పై సీఎం కామెంట్లు.. థాంక్స్ చెప్తున్న రేవంత్ రెడ్డి!

ఈమధ్య డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమం కోసం సినీ నటులందరూ వీడియోలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో పూర్తిగా డ్రగ్స్ లేకుండా చూడాలి అన్నదే ఈ ప్రోగ్రాం మెయిన్ మోటో. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అందరికీ ఈ విషయంపై అవగాహన రావాలంటే సినీనటులందరూ స్పందించి ప్రేక్షకులందరికీ ఈ విషయం గురించి చెప్పాలని కోరారు.

దీనికోసం పలువురు సినీ నటులు స్పందిస్తూ డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పలు వీడియోలు రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం వీడియో చేశారు. అది చూసిన సీఎం రేవంత్ రెడ్డి బన్నీకి థాంక్స్ చెప్తూ తన వర్క్ కి పెద్ద ఫ్యాన్ని అని చెప్పుకొచ్చారు. అయితే వీడియోలో బన్నీ మాట్లాడుతూ డ్రగ్స్ లేని తెలంగాణ మంచి భవిష్యత్తును చూస్తాది.

ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్టయితే తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో టోల్‌ ఫ్రీ నెంబరు 1908కు వెంటనే ఫోన్‌ చేసి తెలపండి. వారినీ డ్రగ్స్ నుంచి బయటికి తెచ్చి మామూలు జీవితం గడపడానికి సహాయం కల్పిస్తామని చెప్పారు. డ్రగ్స్ తీసుకున్న వారిని శిక్షించరు, కేవలం వారిని మంచి దారిలోకి మారుస్తారు. కనుక తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్ తీసుకుంటే వెంటనే స్పందించండి.

మంచి భవిష్యత్తు కావాలంటే చెడు అలవాట్లు వదులుకోవాలి అని చెప్పారు బన్నీ. ఇలాంటి విషయాల మీద సినీ నటులు అందరూ స్పందించడం ఎంతో మంచి విషయం. సమాజంపై సినీ నటుల ప్రభావం ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎవరు చెప్పినా వినని ఫాన్స్ తమ ఫేవరెట్ హీరో చెప్పాడంటే కచ్చితంగా వింటారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా తెలివైనది. ఇదిలా ఉండగా పుష్ప 2 రిలీజ్ కోసం అల్లు అర్జున్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.