‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అన్ని రకాల టికెట్లపై రూ.75 మేర పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. సినిమా విడుదల నుంచి 10 రోజుల పాటు రేట్లు పెంచుకునేందుకు అన్ని అనుమతులు ఇచ్చింది. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జేసీలు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది