నందమూరి బాలకృష్ణ తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఈరోజు తెలంగాణ టిడిపి నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డిలత్ చర్చించారు.
అన్నపూర్ణ స్టూడియోలో వారు ఈ రోజు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కలిశారు. తెలంగాణ ఎన్నికల వాతావరణ గురించి వివరించారు. ప్రజాకూటమి తరపున ప్రచారం నిర్వహించాల్సిందిగా టీడీపీ టీఎస్ అధ్యక్షులు ఎల్.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి బాలకృష్ణను కోరారు. దీనికి ఆయన అంగీకరించారు.
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4 తేదీల మధ్యలో ప్రచారానికి వస్తానని బాలకృష్ణ చెప్పారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి నుంచే ప్రచారం ఉండవచ్చని అనుకుంటున్నారు. అక్కడ ఎన్టీయార్ మనవరాలుసుహాసినీ మ హాకూటమి తరఫున పోటీ చేస్తున్నారు.