Allu Arjun: తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన బన్నీ.. జైలుకు వెళ్లాల్సిందేనా!

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో పెద్ద ఎత్తున ఈ విషయం సంచలనంగా మారింది. అల్లు అర్జున్ అరెస్టుపై అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే విచారణ పేరుతో పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేసి తనని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించిన విషయం తెలిసినదే .అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఇలా విచారణ పేరుతో అల్లు అర్జున్ అరెస్టు చేయడం పట్ల సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.

అక్కడ తొక్కిసలాట జరగడం వల్ల అల్లు అర్జున్ అరెస్టు చేయడం సరికాదు భద్రత లోపం కారణంగా తొక్కిసలాట జరిగి మహిళా అభిమాని మృతి చెందితే ఇలా అల్లు అర్జున్ అరెస్టు చేయడం ఏంటి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ అరెస్టు కావడంతో ఆయన లాయర్లు తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేశారు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి.

సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని న్యాయవాదులు విజ్ఙప్తి చేశారు. పోలీసులను అడిగి 2.30కి చెబుతానని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఇక ఈ విచారణ 2.30కి వాయిదా వేశారు. అయితే 2.30 జరగాల్సిన ఈయన పిటీషన్ విచారణ వాయిదా పడింది.హై కోర్టు సాయంత్రం 4 గంటలకు కోర్టు వాయిదా వేసింది. ఈ క్వాష్ పిటిషన్ లో ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని దాఖలు చేశారు. ఇవాళే నాంపల్లి కోర్టు, తెలంగాణ హైకోర్టులో ఒకే రోజు విచారణ జరుగుతుండటంతో ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

అల్లు అర్జున్ అరెస్టు చేయడంతో ఒకవైపు గాంధీ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రతలను ఏర్పాటు చేశారు ఒకవేళ అల్లు అర్జున్ కి కనుక బెయిల్ రాకపోతే ఆయనని చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం.