TG: తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేసే ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు అటు నుంచి గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలు పూర్తి అయిన అనంతరం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరు పరిచారు. దీంతో అల్లు అర్జున్ కు ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందనే విషయంపై అభిమానులలో ఎంతో ఆత్రుత నెలకొంది. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అనే విషయం తెలిసిన సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్తున్నారు.
ఇక అల్లు అర్జున్ అరెస్టు విషయం ఇటు చిత్ర పరిశ్రమలను అటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెంటనే అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి అక్కడ పరిస్థితిని ఆరా తీశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తిరిగి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళబోతున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది.
ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు అక్కడికి పెద్ద ఎత్తున మీడియా వారు సినిమా సెలబ్రిటీలు వస్తున్న నేపథ్యంలో బందోబస్తు నిర్వహించడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే చిరంజీవి కూడా పోలీస్ స్టేషన్ కి వెళుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు ఆయనకు విజ్ఞప్తి చేశారు దయచేసి చిరంజీవి గారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రావద్దని ఇప్పటికే ఇక్కడ ఒత్తిడి అధికంగా ఉంది దయచేసి పోలీస్ స్టేషన్ కి రావద్దు అంటూ విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే అల్లు అర్జున్ తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ మామ చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు అల్లు శిరీష్ అదే విధంగా నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ఇక ఈ విషయం తెలిసిన పలువురు సినీ సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అరెస్టును తప్పుపడుతున్నారు.