ప్రేమించిన అమ్మాయి కోసం పరితపించిన ప్రియుడు.. అమ్మాయి కుటుంబం అవమానించడంతో ఆత్మహత్య!

ప్రస్తుత కాలంలో యువత చిన్న వయసులోనే ఆకర్షణకులోనే అది ప్రేమ అనే భావించి పొరపడుతున్నారు. కొంతమంది వారి ప్రేమను దక్కించుకోవడానికి తల్లిదండ్రులను ఎదిరించి రహస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు. కానీ పెద్దలు మాత్రం వారిని విడదీస్తున్నారు. ఇటీవల జనగామ జిల్లాలో ఇటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. యువతీ యువకుడు ప్రేమించుకొని పెద్దలు ఒప్పుకోకపోవడంతో రహస్యంగా గుడిలో వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరు ఒకే కులానికి చెందినవారు కావడంతో మళ్లీ వారికి ఘనంగా పెళ్లి జరిపిస్తామని చెప్పి అమ్మాయి తల్లిదండ్రులు వారిద్దరినీ విడదీశారు. ఆ తర్వాత అబ్బాయిని, అబ్బాయి తల్లినీ దారుణంగా అవమానించటంతో వారు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే…జనగామ మండలం పెద్దపహాడ్‌ గ్రామానికి చెందిన దండు సాయికుమార్‌(24) అనే యువకుడు వ్యవసాయంతో పాటు జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తూ తల్లితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అయితే సాయి కుమార్ పక్క గ్రామమైన గోపిరాజుపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే వీరి ప్రేమను పెద్దను అంగీకరించకపోవడంతో నాలుగు నెలలు క్రితం భువనగిరికి వెళ్లి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి జరిగిన మరుసటి రోజే అమ్మాయి తరఫు బంధువులు వచ్చి పెద్దల సమక్షంలో తామే ఘనంగా పెళ్లి జరిపిస్తామని నచ్చజెప్పి యువతిని తీసుకెళ్లారు.

అయితే రోజులు గడిచినా కూడా అమ్మాయి తల్లీ తండ్రులు పెళ్ళి గురించి ప్రస్తావించకపోవడం సాయి కుమార్ ఈ నెల 1 వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలిసులు అమ్మాయి తండ్రిని పిలిపించగ పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుంటామని వెళ్లిపోయారు. తర్వాత గ్రామంలో పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయించాలంటే కుమార్తె పేరు మీద ఒక ఎకరం పొలం రాయాలని డిమాండ్ చేశారు. అబ్బాయి తరుపుపందోలు అందుకు కూడా అంగీకరించారు. అయినప్పటికీ అమ్మాయి తరపు బంధువులు అతనిని చులకనగా మాట్లాడుతూ అతని కుటుంబ సభ్యులను కూడా అవమానపరిచారు. అందరి ముందు అలా అవమానపరచడంతో తీర మనస్థాపానికి గురైన సాయికుమార్ అతని తల్లి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా సాయికుమార్ మరణించాడు అతని తల్లి మాత్రం ప్రాణాలతో పోరాడుతోంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సాయికుమార్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు