కరోనాతో ఆంధ్రా యువతి దీన స్థితి… హీరో అంటూ కేటీఆర్‌పై పొగడ్తలు..!

KTR

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, ప్రజా సమస్యలపై, ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతికి ఆయన ఇచ్చిన సమాధానం చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. దటీజ్ కేటీఆర్ అంటున్నారు.

పొట్ట కూటి కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ యువతి.. ఉద్యోగం కో సం ఎన్నో ప్రయత్నాలు చేసినా దొరకలేదు.. ఇక చేసేదేమీ లేక సొంత ఊరికి వెళ్లిపోదామనుకుంది. అయితే ఇంతకో కరోనా లాక్ డౌన్‌తో హైదరాబాద్‌లోనే చిక్కుకుపోయింది. చేతిలో డబ్బులేదు, తినడానికి తిండి కూడా లేదు. ఆ బాధనే మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా తెలిపింది. సొంతూరుకు వెళ్లడానికి సాయం చేయాలని కోరింది.

ఆ యవతి ట్వీట్ కు స్పందించిన కేటీఆర్ ‘చెల్లెమ్మా! ఆందోళన చెందకు. మా బృందం నీకు సహాయం అందిస్తుంది’ అంటూ భరోసా ఇచ్చారు. కేటీఆర్ తో పాటు మరికొందరు నెటిజన్లు కూడా ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆమె వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది చూసిన వారంతా కేటీఆర్ ఓ హీరో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.