ఇకపై నెట్ అవసరం లేకుండా వాట్సాప్ మెసేజ్ లు… ఎలాగంటే..?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో స్మార్ట్ఫోన్లు ఉపయోగించే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిన తర్వాత వాట్సప్ ఉపయోగించే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. ఈ ప్రముఖ మెసేజింగ్ యాప్ ద్వారా ఛాటింగ్, కాలింగ్, వీడియో కాల్ వంటి సదుపాయాలను వియోగదరులకు అందిస్తోంది. అంతే కాకుండా తమ వినియోగదారులను పెంచుకోవడానికి క రోజురోజుకీ కొత్త కొత్త అప్డేట్స్ తెస్తూ వాట్సాప్ యూజర్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తమ సర్వీస్ లకు ప్రాక్సీ సపోర్టు ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

వాట్సప్ యాజమాన్యం అందుబాటులోకి తీసుకురానున్న ఈ కొత్త ఫీచర్ వల్ల ఇంటర్నెట్ కి అంతరాయం కలిగినా కూడా వాట్సాప్ ని ఉపయోగించవచ్చు. వాట్సాప్ యాజమాన్యం అందించిన సమాచారం ప్రకారం, ప్రాక్సీ ఫీచర్ అనే ఈ సరికొత్త ఫీచర్ ఉపయోగించడం వల్ల ప్రైవసీ మరియు భద్రతకు ఎలాంటి హాని కలుగదు అని సమాచారం. అంతే కాకుండా వ్యక్తిగత మెసెజ్ లను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా సేఫ్ గా స్టోర్ చేయవచ్చు. ఈ సరికొత్త ఫీచర్ వల్ల “ఇంటర్నెట్ అందుబాటులో లేని సమయంలో కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్ లు రిసీవ్ చేసుకోవటమే కాకుండా సెండ్ చేసే అవకాశం కూడా ఉంటుందని ప్రకటించింది.

ఇక తాజాగా ” ఇంటర్నెట్ షట్ డౌన్ ఎప్పుడూ జరగకూడదని, ఒకవేళ అలాంటి సంఘటనలు తలెత్తినా కూడా వాట్సాప్ వినియోగదారులకు అంతరాయం కాకుండా ఎల్లప్పుడూ కొనసాగాలని ఆశ పడుతున్నాం అని ప్రకటించింది. ఈ క్రమంలో ఇలాంటి సరికొత్త అప్డేట్ తీసుకురావడం జరిగిందని తెలిపారు. అయితే స్మార్ట్ ఫోన్ లో ఈ ఫీచర్ కోసం సెట్టింగ్ లోకి వెళ్ళి చెక్ చెయ్యాలి. ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రాక్సీ సర్వర్ త్వరలో అందుబాటులోకి వస్తుంది.. ఈ కొత్త ఫీచర్ వల్ల వాట్సాప్ వినియోగదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.