రోజుకు 47 రూపాయల పొదుపుతూ 27 లక్షల మీ సొంతం చేసుకోండి?

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నో రకాల పథకాలను అమలులోకి తీసుకువచ్చారు అయితే తాజాగా ఎల్ఐసి ఆఫ్ ఇండియా మరొక కొత్త పాలసీని తీసుకువచ్చారు. ఈ పాలసీ ద్వారారాబోయే రోజులలో ఎంతో సంతోషంగా గడపవచ్చని చెప్పాలి మరి ఎల్ఐసి తీసుకువచ్చిన ఆ కొత్త పాలసీ ఏంటి ఈ పాలసీ ద్వారా ఎంత పెట్టుబడి పెట్టాలి ఎన్ని సంవత్సరాలకు మెచ్యూరిటీ తర్వాత ఎంత డబ్బులు పొందవచ్చు అని విషయానికి వస్తే…

ఎల్ఐసి అందించే పథకాలలో జీవన్ ఉమాంగ్ పథకం ఒకటి.ఈ పథకం ద్వారా మీరు కేవలం 45 రూపాయలను పొందు చేయడం ద్వారా సుమారు 27 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. ఇలా ఈ స్కీం మెచ్యూరిటీ పోతే అయిన తర్వాత ప్రతి ఏడాది కూడా మీరు డబ్బును సొంతం చేసుకోవచ్చు.ఈ పాలసీల చేరిన పాలసీదారుడు కొన్ని కారణాల వల్ల మరణిస్తే తను నామినీగా పెట్టిన వారికి ఈ డబ్బు మొత్తం చెల్లుతుంది.

ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ పాలసీలో భాగంగా రోజుకు 45 రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ.1350 ప్రీమియంగా డిపాజిట్ చెయ్యాల్సి వుంది. అంటే సంవత్సరానికి రూ.16200 అవుతుంది. 30 ఏళ్లపాటు తీసుకుంటే 30 ఏళ్లలో రూ. 4.86 లక్షలు డిపాజిట్ అవుతుంది. మెచ్యూరిటీ 31 సంవత్సరాలలో ఉంటుంది. అప్పటి నుండి 100 సంవత్సరాల వయస్సు వరకు సంవత్సరానికి 40 వేల రూపాయల వరకు రిటర్న్‌లను పొందొచ్చు. ఇలా ఈ పథకం నుండి 27 లక్షల రూపాయల కంటే ఎక్కువే వస్తాయి. ఇలా రోజుకు కేవలం 45 రూపాయల పెట్టుబడితో రాబోయే రోజులలో అధిక ఆదాయంతో డబ్బును పొందవచ్చు.