ఇకపై కరెంట్ చార్జింగ్ లేకుండా బ్యాటరీతో నడిచే వాహనాలు.. ఈ బ్యాటరీ వాహనాల ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

ప్రస్తుత కాలంలో పెట్రోల్ డీజిల్ తో నడిచే వాహనాల వల్ల వాతావరణ కాలుష్యం పెరగడమే కాకుండా రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులకు ఇది అధిక భారంగా మారింది. ఇలా పెట్రోల్ డీజిల్ ధరలను భరించలేక చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు.అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నిసార్లు ప్రమాదానికి గురవుతున్న సంఘటనలు పలుచోట్ల చోట్ల చేసుకుంటున్నాయి. కొన్ని బ్యాటరీలు పేలడం లేదంటే చార్జింగ్ అయిపోవడంతో మధ్యలోనే ఇబ్బంది పడడం వంటి సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇకపోతే ఇకపై పెట్రోల్ డీజిల్ లేకుండా కరెంట్ ఛార్జింగ్ తో పని లేకుండా కేవలం బ్యాటరీల సహాయంతో నడిచే వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.అయితే ఈ బ్యాటరీల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు కేవలం మన ఇంట్లో వంట సిలిండర్ అయిపోయిన తర్వాత నిండు సిలిండర్ ఎలా తెచ్చుకుంటామో ఈ బ్యాటరీ పూర్తి అయిన తర్వాత దీనిని పెట్రోల్ బంక్ లోను లేదా ఇతర షాపులలో కాలి బ్యాటరీ ఇచ్చి మనం ఫుల్ బ్యాటరీని తెచ్చుకోవచ్చు. మరి ఈ బ్యాటరీ ద్వారా ఇలాంటి ప్రయోజనాలు వీటి ధరలు ఏంటి అనే విషయానికి వస్తే…

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పరిశోధన విభాగం డైరెక్టర్, కంపెనీ బోర్డు సభ్యుడు డాక్టర్ ఎస్ఎస్వీ రామ్ కుమార్ ఈ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఈ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీ ప్రస్తుత మార్కెట్లో ఉన్న బ్యాటరీ ధరలతో పోలిస్తే చాలా తక్కువ అని తెలిపారు. అయితే ఈ బ్యాటరీ తయారు చేయడానికి మనం విదేశాలపై ఆధారపడాల్సిన పనిలేదని మన దేశంలో దొరికే అల్యూమినియంతో ఇది తయారు చేయవచ్చని తెలిపారు. ఈ అల్యూమినియం బ్యాటరీతో దాదాపు 500 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుందని తెలిపారు.ఈ బ్యాటరీ కి రీఛార్జ్ చేయాల్సిన పనిలేదు పేలుతుందన్న భయం అసలు ఉండదని కేవలం బ్యాటరీ అయిపోయిన తర్వాత పెట్రోల్ బంకులలో మరొక బ్యాటరీ తెచ్చుకోవడమే నని తెలిపారు. అయితే ఈ బ్యాటరీ ఎంత పడుతుంది ఏంటి అనే ధరలను ఇంకా ఖరారు చేయలేదు.ఇదే కనుక అమలులోకి వస్తే ఇకపై పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు కరెంట్ బిల్లులతో బాధపడకుండా ఎంచక్కా బ్యాటరీ వాహనాలలో ప్రయాణం చేయవచ్చు అని చెప్పాలి.

India, Israel working on Aluminium-Powered Car