మీ లాప్ టాప్ బ్యాటరీ కెపాసిటీ తగ్గిపోతుందా… ఈ టిప్స్ పాటించండి!

ప్రస్తుత కాలంలో లాప్టాప్, స్మార్ట్ ఫోన్ వంటి గాడ్జెట్ల వాడకం రోజురోజుకి బాగా పెరిగిపోతుంది. ప్రస్థుత కాలంలో ఏ చిన్న,పెద్ద పనైనా కూడా లాప్ టాప్, ఫోన్ ద్వారా పూర్తి చేయవచ్చు. అంతే కాకుండా ప్రతిది డిజిటలైజ్ కావటంతో వీటి వాడకం పెరిగిపోతోంది. అయితే ప్రతి రోజూ గంటలు తరబడి వీటిని ఉపయోగించటం వల్ల వాటి లైఫ్ టైం కూడా తగ్గిపోతోంది. ముఖ్యంగా లాప్ టాప్ ని ప్రతి రోజూ వాడటం వల్ల రోజురోజుకీ దాని బ్యాటరీ కెపాసిటీ తగ్గుతుంది. దీంతో బ్యాటరీ ఛార్జ్ చేసిన కొంత సమయానికే అయిపోతుంది. అయితే లాప్ టాప్ లో ఎక్కువ సమయం ఉండేందుకు మనం కొన్ని టిప్స్ పాటించాలి. ఇప్పుడు మనం ఆ టిప్స్ గురించి తెలుసుకుందాం.

విండోస్ 10 లాప్ టాప్ ఉపయోగిస్తున్నవారు బ్యాటరీ ఎక్కువ సమయం ఉండేందుకు మొదట సిస్టమ్‌లో కమాండ్ ప్రాంప్ట్‌ను ఓపెన్ చేయండి.

• సిస్టంలో కమాండ్ ప్రాంప్ట్‌ కోసం, విండోస్ సెర్చ్ లేదా స్టార్ట్ మెనూలో ‘cmd’ లేదా ‘కమాండ్ ప్రాంప్ట్’ని సెర్చ్‌ చేయండి.
• ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే ఫైల్ పాత్‌తో కూడిన విండోను కనిపిస్తుంది.. ఇది నలుపు రంగులో లేదా వేరే రంగులో ఉంటుంది.
• అక్కడ powercfg/batteryreport అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇలా చేయడం వల్ల సేవ్ చేయబడిన బ్యాటరీ లైఫ్ టైమ్ రిపోర్ట్ మెసెజ్ మీ ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
• అంతే కాకుండా ఫైల్ పాత్ కూడా మీ లాప్ టాప్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇప్పుడు దానిపై క్లిక్ చేస్తే మీ లాప్ టాప్ బ్యాటరీ రిపోర్ట్‌ కనిపిస్తోంది.

ఈ పద్ధతిలో కాకుండా మరొక పద్దతిలో కూడా మీ లాప్టాప్ బ్యాటరీ కెపాసిటీ తెలుసుకోవచ్చు. అందుకోసం మొదట మీరు యూజర్ ఫోల్డర్‌కి వెళ్లి C:Users[Your_User_Name]battery-report.html అని టైప్ చేయండి. ఇలా చేయటం వల్ల మీ లాప్ టాప్ బ్యాటరీ సామర్థ్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.