లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ ఎన్నో పథకాలను ఆములలోకి తీసుకువచ్చి ప్రజలకు ఆర్థికంగా ఆసరాగా నిలుస్తోంది. ఎల్ఐసి సంస్థ అందుబాటులోకి తెచ్చిన పథకాల ద్వారా ప్రజలు వారి డబ్బును అందులో భద్రపరచుకుంటున్నారు. ఈ డబ్బుకి వడ్డీ కూడా అందుకున్నారు. అంతే కాకుండా ఎల్ఐసి మెంబర్ షిప్ తీసుకున్నవారు అతి తక్కువ రెట్లకే లోన్ పొందుతున్నారు. ఇదిలా ఉండగా అయితే ఎల్ఐసి లో బీమా ప్లాన్ తీసుకున్న వారికి పాలసీ పత్రం అందజేశారు. మనం ఎల్ఐసి లో ఇన్వెస్ట్ చేసిన డబ్బు క్లెయిమ్ చేయాలన్నా లేదా పాలసీని సరెండర్ చేయాలన్నా ఈ పాలసీ పత్రం తప్పనిసరిగా ఉండాలి అందువల్ల దీనిని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి.
అయితే పొరపాటున ఎవరైనా ఈ పాలసీ పత్రం పోగొట్టుకుంటే దానిని తిరిగి పొందటానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎల్ఐసి లో భీమా తీసుకున్నవారు వారి పాలసీపత్రం పోగొట్టుకుంటే ఎల్ఐసీ నుంచి డూప్లికేట్ పాలసీ పత్రాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ డూప్లికేట్ పాలసీ పత్రాన్ని పొందటానికి మీ ఎల్ఐసీ ఏజెంట్ ని సంప్రదించాలి. అంతే కాకుండా ఏదైనా వార్తాపత్రికలో ప్రకటన ఇవ్వాలి. ఎవరికైనా దొరికితే వారు మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే పాలసీ పత్రం పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అలా ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు రసీదు ఇస్తారు. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ తర్వాత బాండ్ దాఖలు చేయాలి. ఆ తర్వాత నాన్-జుడీషియల్ స్టాంప్ పేపర్‌పై బీమాదారు, పాలసీదారు సంతకం చేయాలి. ఆ తర్వాత ఎల్ఐసీ శాఖకు వెళ్లి డూప్లికేట్ పాలసీ కోసం దరఖాస్తు చేయండి. ఇలా దరఖాస్తు చేయటం వల్ల మీకు ఓ డూప్లికేట్ పాలసీ పత్రాన్ని బీమా కంపెనీ జారీ చేస్తుంది. దాని మీద డూప్లికేట్ అని ఉంటుంది. ఈ డూప్లికేట్ పాలసీ పత్రాన్ని ఉపయోగించి డబ్బు క్లెయిమ్ చేసుకోవచ్చు.