వన్ ప్లస్ వినియోగదారులకు గుడ్ న్యూస్… వన్ ప్లస్ నుండి తొలి ట్యాబ్ …!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడం వల్ల స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. అందువల్ల వివిధ కంపెనీల నుంచి కొత్త కొత్త మొబైళ్లు, ట్యాబ్‌లు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల దేశ విదేశ కంపెనీలకు చెందిన ట్యాబ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక ఫిబ్రవరి 7వ తేదీని వన్‌ప్లస్‌ క్లౌడ్‌ 11 ఈవెంట్‌లో వన్‌ప్లస్‌ ప్యాడ్‌ పేరుతో ట్యాబ్‌ను విడుదల చేయనుంది. దీంతో వన్‌ప్లస్‌ 11 5జీ, వన్‌ప్లస్‌ 11 ఆర్‌, వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రో, వన్‌ప్లస్‌ స్మార్ట్‌ టీవీని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వన్ ప్లస్ ట్యాబ్ యొక్క ప్రత్యేకతలు ధరల వివరాల గురించి ఎప్పుడూ తెలుసుకుందాం.

వన్‌ప్లస్ పాడ్ స్పెసిఫికేషన్స్‌ :

తాజాగా ప్యాడ్‌ టీజర్‌ ఫొటోను వన్‌ప్లస్‌ ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసింది. ట్యాబ్‌ వెనుక భాగం, ముందు భాగంలో సింగిల్‌ కెమెరాలు అందించింది. ఇక ఈ ట్యాబ్ ని అల్యూమినియం ఫ్రేమ్‌తో డివైజ్‌ రూపొందించారు. దీని డిస్‌ప్లే 11.6 అంగుళాలు. ట్యాబ్‌ కుడివైపు సైడ్‌లో టచ్‌ సెన్సర్‌, వాల్యూమ్‌ కంట్రోల్‌ బటన్స్ ఉంటాయి . ఈ ట్యాబ్‌ ధర రూ. 35 వేల నుంచి రూ.40 వేల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్యాబ్‌ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. వన్‌ప్లస్‌ 11ఆర్‌లో స్నాప్‌ డ్రాగన్‌ 8జెన్‌ 1+ ప్రాసెసర్‌, 5జీ వంటి సదుపాయాలున్నాయి.

వన్‌ప్లస్‌ 11సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లు :

ఇక వన్‌ప్లస్‌ 11 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తోంది. వన్‌ప్లస్‌ 11ఆర్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1+ ప్రాసెసర్‌ను, వన్‌ప్లస్ 11 5జీలో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 8 జీబీ+128 జీబీ స్టోరేజ్‌, 16 జీబీ/256 జీబీ వేరియంట్లలో ఈ రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్నట్లు సమాచారం.

స్మార్ట్‌వాచ్‌పై తగ్గింపు :

ఇక ప్రస్తుతం వన్‌ప్లన్‌ నార్డ్‌ స్మార్ట్‌వాచ్‌పై డిస్కౌంట్ లు అందుబాటులో ఉన్నాయి. వన్ ప్లస్ స్మార్ట్ వాచ్ ధర రూ. 4,499 ఉండగా దీనిపై రూ.500 వరకు తగ్గింపు ఇస్తోంది. అంతేకాకుండా కస్టమర్‌లు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 500 ఇన్సిడెంట్ డిస్కౌంట్ పొందవచ్చు . అంతేకాకుండా, MobiKwik Wallet వినియోగదారులు ఈ డీల్‌పై అదనంగా రూ. 500 క్యాష్‌బ్యాక్‌ కూడా పొందవచ్చు.