ఫాస్ట్ ట్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయడం ఇప్పుడు మరింత సులభం… ఎలాగో తెలుసా..?

సాధారణంగా ద్విచక్ర వాహనాలు కాకుండా..జాతీయ రహదారులపై వెళ్లే కార్లు బస్సులు లారీ వంటి ఫోర్ వీలర్ వాహనాలు తప్పనిసరిగా టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు టాక్స్ వసూలు చేయటం కోసం అక్కడక్కడ టోల్ ప్లాజాలను ఏర్పాటు చేశారు. అయితే గతంలో టోల్ ప్లాజా వద్ద డబ్బు చెల్లించి రిసిప్ట్ తీసుకునేవారు. అయితే ప్రస్తుతం ఈ చెల్లింపులు డిజిటలైజ్ అయ్యాయి. ఫాస్ట్ టాగ్ పద్ధతి ద్వారా వాహనదారులు ఇప్పుడు ఈ ఫీజు చెల్లించవచ్చు. ఫోర్ వీలర్ వాహనాలు కలిగిన వాహనదారులు తప్పనిసరిగా ఫాస్ట్ టాగ్ తీసుకోవాలి. ఫాస్ట్ టాగ్ లేనియెడల టోల్ ప్లాజా దాటి వెళ్ళటానికి వీలు ఉండదు. అయితే ఈ ఫాస్ట్ టాగ్ తీసుకున్న వాహనదారులు ఫాస్ట్ టాక్ పే చేయటం కోసం కొంత మొత్తంలో అకౌంట్ లో డబ్బు ఉంచుకోవాలి.

కొన్ని సందర్భాలలో అకౌంట్ లో బ్యాలన్స్ అయిపోయి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఫాస్ట్ టాగ్ బ్యాలన్స్ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అయితే ఈ ఫాస్ట్ టాగ్ బ్యాలన్స్ చెక్ చేయటం ఇప్పుడు మరింత సులభం. ఫాస్ట్ టాగ్ బ్యాలన్స్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫాస్ట్ టాగ్ బ్యాలన్స్ చెక్ చేయటానికి మొదట మీరు My FASTag యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఆ తరవాత మీరు ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ సెక్షన్‌ లోకి వెళ్లి అక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేసి డీటెయిల్స్ తో లాగిన్ అవ్వాలి.
ఆ తర్వాత అక్కడ ఉన్న వ్యూ బాలన్స్ పైన క్లిక్ చేస్తే ఫాస్ట్ టాగ్ అకౌంట్ బ్యాలన్స్ ఎంత ఉందో మనం
తెలుసుకోవచ్చు.
ఆ తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా ఫాస్ట్‌ ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ మనకి తెలుస్తుంది.
అంతే కాకుండా ఫాస్ట్‌ట్యాగ్‌కు రిజిస్టర్ చేసిన తర్వాత టోల్ ప్లాజాల దగ్గర నుండి డెబిట్ అయ్యాక మెసేజ్ వస్తుంది.

ఇక ప్రీపెయిడ్ వ్యాలెట్‌కు మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటే ప్రీపెయిడ్ ఫాస్ట్‌ట్యాగ్ కస్టమర్ అయితే 08884333331 టోల్ ఫ్రీ కి కాల్ చేసి పూర్తీ వివరాలు తెలుసుకోవచ్చు.