యూజర్లకు గూగుల్ అనేక సేవలను అందిస్తోంది. గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. గూగుల్ అకౌంట్‌కు అనేక యాప్‌లు, సర్వీసులు లింక్ అవుతాయి. అందువల్ల గూగుల్ అకౌంట్ అనేది చాలా కీలకం అని చెప్పవచ్చు. అందువల్ల గూగుల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా చాలా అవసరం. గూగుల్ అకౌంట్ ని సెక్యూర్ గా ఉంచే టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* సేఫ్ బ్రౌజింగ్ ఎనేబుల్
గూగుల్ అకౌంట్ లో సేఫ్ బ్రౌజింగ్ ఎనేబుల్ చేయడం వల్ల హానికరమైన వెబ్‌సైట్లు, డౌన్‌లోడెడ్ ఫైల్స్, క్రోమ్, ఇతర యాప్‌లలో ఉపయోగించే ఎక్స్‌టెన్షన్స్‌ను యూజర్లు యాక్సెస్ చేయకుండా రక్షిస్తుంది. పొరపాటున యూజర్‌ల పాస్‌వర్డ్ లీక్ అయ్యుంటే.. ఈ ఫీచర్ వారిని హెచ్చరిస్తుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే.. గూగుల్ అనేది క్రోమ్ URLలను, గూగుల్ యాప్‌లను ఉపయోగిస్తూ యూజర్లు, వారి అకౌంట్‌కి హాని కలిగించే హానికరమైన యాక్టివిటీని గుర్తిస్తుంది.
* కొత్త అకౌంట్ సైన్-ఇన్ అలర్ట్స్
సాధారణంగా యూజర్లు స్నేహితులు ఇతర వ్యక్తులు వేరే డివైస్లలో గూగుల్ అకౌంట్ కి లాగిన్ అవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో, గూగుల్ యూజర్లకు కొత్త సైన్-ఇన్ అలర్ట్ పంపుతుంది. అంతేకాకుండా అకౌంట్ లో లాగిన్ ఏ ప్రాంతం నుండి జరిగింది, ఏ డివైస్ లో..ఏ టైం కి జరిగింది అన్న పూర్తి సమాచారాన్ని మనకు తెలుపుతుంది. ఈ ఫీచర్ ద్వారా డేటా ఇతరులు చూడకుండా అలర్ట్ చేస్తుంది.
* గూగుల్ సెక్యూరిటీ చెకప్
మీ గూగుల్ అకౌంట్ ఏయే డివైజ్‌లలో లాగిన్ అయి ఉందో చెక్ చేయడానికి గూగుల్ సెక్యూరిటీ చెకప్‌ను అందిస్తోంది. ఈ ఫీచర్ సహాయంతో గతంలో ఏదైనా ఫోన్ లేదా టాబ్లెట్ ఉపయోగించి ఉంటే మీ అకౌంట్ యాక్సిస్ తో తొలగించమని గూగుల్ కోరుతుంది. గూగుల్ అకౌంట్ సైన్ ఇన్ , రికవరీ కోసం ఉపయోగించిన ఐడిని వెరిఫై చేసిఆ డివైస్ ల నుండి వాటిని తొలగించవచ్చు.
* పాస్‌వర్డ్ ట్రాకింగ్
ఈరోజుల్లో అందరికీ బోలెడన్ని డిజిటల్ అకౌంట్స్ ఉంటాయి. అందువల్ల వాటి పాస్వర్డ్ ట్రాక్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సెక్యూరిటీ చెకప్‌తో, మీ పాస్‌వర్డ్‌లలో ఏవి డేటా బ్రీచ్స్‌కి ఎఫెక్ట్ అయ్యాయో మీరు తెలుసుకోవచ్చు. ఎక్స్‌పోజ్డ్ అకౌంట్ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోవాలని గూగుల్ యూజర్లకు సలహా కూడా ఇస్తుంది.