మానవాళి మనగడుకు గాలి నీరుతో పాటు డబ్బు కూడా ఎంతో అవసరం. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలోనూ డబ్బులు అనేవి కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కొన్ని కారణాలవల్ల చిరిగిపోవడం లేదా కాలిపోవడం లేదా తడిచిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా కరెన్సీ నోట్లు మొత్తం పాడైపోయి ఇబ్బంది పడుతున్న వారు ఈ నోట్లను చాలా సులభంగా మార్చుకోవచ్చు. మరి ఆ నోట్లోని ఎలా మార్చుకోవాలి అనే విషయానికి వస్తే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం మహాత్మా గాంధీ శ్రేణితో సహా, వ్రాసిన లేదా వేరే రంగులో ఉన్న నోట్లు ఏవైనా సరే అంకెలు క్లియర్ గా ఉంటే ఏ బ్యాంకు కూడా ఆ నోట్లోను మార్చుకోవడానికి నిరాకరించదు. ఇలా డామేజ్ అయిన నోట్లనో ఏ బ్యాంకులో అయినా మనం డిపాజిట్ చేయవచ్చు. లేదా మార్చుకోవచ్చు. అలా కాకుండా రాజకీయ లేదా మతపరమైన సందేశాలు ఉన్నటువంటి కరెన్సీ నోట్లు మార్చుకోవడానికి కుదరదని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.
2009 రూల్స్ ప్రకారం నోట్లకు సంబంధించి అలాంటి క్లెయిమ్‌ను రిజర్వ్ బ్యాంక్ చేస్తుంది. మ్యుటిలేట్ చేసిన నోట్లను కూడా మార్చచ్చు. సర్క్యులర్లను ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తూనే ఉంటుంది.అయితే ఈ విధంగా తిరిగిపోయిన నోట్లో కేవలం 20 వరకు మాత్రమే మార్చుకునే అవకాశాన్ని కల్పించింది అలాగే ఈ డబ్బు మొత్తం విలువ ఐదువేలకు మించ కూడదని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.