లాప్టాప్ ఓవర్ హీట్ అయ్యి సమస్యలు వస్తున్నాయా.. అయితే ఇలా చేస్తే సరి..?

ప్రస్తుతం ఉన్న ఈ టెక్నాలజీ కాలంలో ప్రతి ఒక్కరు ల్యాప్టాప్ మొబైల్ ఫోన్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ రోజులలో ఈ లాప్టాప్ లో మొబైల్ ఫోన్లో లేకపోతే జీవించడం కూడా కష్టంగా మారుతుందేమో అన్నంతగా.. ప్రజలు వీటికి అలవాటు పడ్డారు. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాకుండా ప్రతి ఒక్కరూ లాప్టాప్ తో ఎక్కువ సమయాన్ని గడుపుతో అందులోనే పనిచేస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు ఎక్కువ సమయం లాప్టాప్ లో పనిచేయడం వల్ల లాప్టాప్ ఓవర్ హీట్ అవ్వడం లేదా హ్యాంగ్ అవ్వటం వంటి సమస్యలు తరచూ మనం ఎదుర్కొంటుంటాము. అయితే లాప్టాప్ ఇలా తరచూ హీట్ అవ్వకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది.

1. యాప్స్ ను డిలీట్ :

సాధారణంగా మనం లాప్ టాప్ ఉపయోగించేటప్పుడు మనకి అవసరమైన అప్లికేషన్స్ మాత్రమే కాకుండా ఇతర అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉంటాము. అంతేకాకుండా క్రోమ్ ఎక్స్ టెంషన్స్, వివిధ రకాల ప్లగ్ ఇన్స్ వంటి వాటిని లాప్ టాప్ లో ఇన్ స్టాల్ చేసి ఉపయోగించుకుంటాము. అయితే వీటిని ఉపయోగించిన తర్వాత డిలీట్ చేయకుండా అలాగే సిస్టంలో ఇన్స్టాల్ చేసి ఉంచటం వల్ల అవి బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి. అవి ఇలా రన్ అవటం వల్ల.. లాప్టాప్ హీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మనకు అవసరం లేని వాటిని డిలీట్ చేసి జంక్ ఫైల్స్ ను క్లియర్ చేయాలి. ఇలా చేయడం వల్ల లాప్ టాప్ లో హిటింగ్ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు, సిస్టమ్ హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది.

2. బయాస్ అప్డేట్ :

సాధారణంగా ప్రతిరోజు లాప్టాప్ ఉపయోగించేవారు కొన్ని సందర్భాలలో లాప్టాప్ బయాస్ ను అప్డేట్ చేయటం మర్చిపోతూ ఉంటారు. ఇలా లాప్ టాప్ బయాస్ అప్డేట్ చేయకపోవడం వల్ల సిస్టమ్ ర్యామ్ లోని జామ్ విపరీతంగా పెరిగిపోతుంది. దీని కారణంగా సీపీయూ అధిక ఒత్తిడికి గురై సిస్టమ్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల లాప్టాప్ బయాస్ సెట్టింగ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఇలా అప్డేట్ చేయడం వల్ల ర్యామ్ పైన అలాగే సీపీయూ పైన ఒత్తిడి తగ్గి సిస్టమ్ హీట్ అవ్వకుండా ఉంటుంది.