ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు చేతిలో సెల్ఫోన్ తప్పనిసరిగా మనకు దర్శనమిస్తుంది. ఇలా చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారు వరకు సెల్ ఫోన్లకు బానిసలుగా మారిపోయారు. సెల్ ఫోన్ చేతిలో ఉంటే పక్కన ఎలాంటి ప్రళయం వచ్చినా గమనించే పరిస్థితులలో ఉండటం లేదు. కొన్నిసార్లు సెల్ ఫోన్ మోజులో పడి భోజనం చేయడం కూడా మర్చిపోతూ ఉంటారు అయితే ఇలా చాలామంది సెల్ ఫోన్ కు బానిసలుగా మారి ఎన్నో ప్రమాదాల బారిన కూడా పడుతుంటారు.
ఇలా సెల్ ఫోన్లతోనే కాలక్షేపం గడిపేవారు సెల్ఫోన్లో ఎప్పటికప్పుడు బ్యాటరీ రీఛార్జి చేస్తూ ఉండాలి అయితే చాలామంది సెల్ఫోన్ కు ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా మొబైల్ వాడుతూ ఉంటారు.ఇలా చార్జింగ్ పెట్టే సమయంలో మొబైల్ ఫోన్ వాడటం వల్ల రెండు రకాల ప్రాసెసింగ్లు జరిగి బ్యాటరీ పై అలాగే స్క్రీన్ పై ఎక్కువ ఒత్తిడి వస్తుంది ఇలా రావడం వల్ల కొన్ని సార్లు సెల్ ఫోన్ పేలే ప్రమాదం ఉంటుంది అందుకే చార్జింగ్ పెట్టే సమయంలో పొరపాటున కూడా సెల్ ఉపయోగించకపోవడమే మంచిది.
ఇక సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టేటప్పుడు చాలామంది మొబైల్ ఫోన్కు కంపెనీ వాళ్ళు ఇచ్చిన చార్జర్ తో కాకుండా ఏది అనుకూలంగా ఉంటే దానికి పెట్టేస్తాము ఇలా పెట్టడం వల్ల తొందరగా సెల్ పాడయి బ్యాటరీ పేలే అవకాశం ఉంటుంది. అందుకే కంపెనీకి చెందిన చార్జర్లను ఉపయోగించడం ఎంతో మంచిది. అయితే కొన్నిసార్లు కంపెనీ వారు ఇచ్చిన చార్జర్ పాడైపోవడంతో చాలామంది చవుకగా ఆన్లైన్లో లభించే చార్జర్లు కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి చార్జర్లతో చార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్ పనితీరు దెబ్బతింటుంది. ఇంకా అనతి కాలంలోనే ఫోన్ పేలిపోయే ప్రమాదం పొంచిఉంది. ఇక చార్జింగ్ పెట్టేటప్పుడు సెల్ రక్షణ కోసం మనం వేసుకున్నటువంటి పౌచ్ ఒక్కొక్కసారి వేడెక్కుతుంది