Tata Car Offers: టాటా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్స్ .. ఏకంగా అన్ని రూ.వేల డిస్కౌంట్!

ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ టాటా తమ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. ఏకంగా రూ.40 వేల వరకూ తగ్గింపులు
టాటా మోటార్స్ ఏప్రిల్ 2024 నెలలో తన లైనప్‌లో వివిధ మోడళ్లపై గణనీయమైన తగ్గింపులు, ప్రమోషనల్ ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. ఈ తగ్గింపులు కస్టమర్‌లను ఆకర్షించడం, పోటీతత్వ ఆటోమోటివ్ మార్కెట్‌లో అమ్మకాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరి ఏయే కార్లపై ఎంత ఆఫర్లను అందిస్తున్నారో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టాటా ఆల్ట్రోజ్ కారుపై రూ.35 వేల వరకూ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

ఎంటీ, డీజిల్, సీఎన్‌జీ, పెట్రోల్ డీసీఏ పెట్రోల్ వేరియంట్ లలో కూడా ఈ కారు అందుబాటులో ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ , 1.5 లీటర్ డీజిల్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా టాటా నెక్సాన్ కారుపై రూ. 15 వేల వరకూ ఎక్స్ఛేంజ్ అందుబాటులో ఉంటాయి. ఈ కారు ధర రూ. 8.15 లక్షల నుంచి రూ. 15.80 లక్షల వరకూ ఉంటుంది. అలాగే ఈ కారు సీఎన్‌జీ వేరియంట్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ ఆధారంగా పని చేస్తుంది. ఇకపోతే టాటా సఫారి ఎంవై 2023 స్టాక్‌లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది.

టాప్-స్పెక్ ఏడీఎస్ అమర్చిన వేరియంట్ లతో పాటు నాన్ ఏడీఏఎస్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఫేస్‌లిఫ్టెడ్ మోడల్స్‌పై రూ. 70,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. టాటా టియాగో కారు రూ. 40,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. టాటా టియాగో వేరియంట్లు ఎక్స్‌టీ, ఎక్స్‌టీ ఎక్స్ఎం వేరియంట్లపై తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఈ కారులు ధరలు రూ. 5.65 లక్షల నుంచి రూ. 8.90 లక్షల వరకూ ఉంటుంది.