తెలుగు తేజం అనూషకు విజయవాడలో ఘన స్వాగతం(వీడియో)

క్రీడాకారిణి దొంకెన అనూషకు కృష్ణ జిల్లా విజయవాడ రైల్వేస్టేషన్లో ఘన స్వాగతం లభించింది. సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఇంటర్నేషనల్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యాన్ని దక్కించుకుంది అనూష. తిరిగి స్వగ్రామమైన కృష్ణా జిల్లా మైలవరం మండలం పొందుగల గ్రామానికి చేరుకోనుంది.

ఈ సందర్భంగా అనూషకు హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్చంద సంస్థకు చెందిన యువకులు, క్రీడాభిమానులు విజయవాడ రైల్వేస్టేషన్లో ఘన స్వాగతం పలికారు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అనూష రాష్ట్రానికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిందంటూ ఆమెను ప్రశంసించారు. ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించి సహాయం అందించాలని, తద్వారా ఆమె మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంటుందని క్రీడాభిమానులు డిమాండ్ చేశారు.

అనూషకు రైల్వేస్టేషనులో స్వాగతం పలుకుతున్న దృశ్యాలను కింద ఉన్న వీడియోలో చూడవచ్చు.