దేశ ప్రజలందరూ దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ప్రజలందరూ కొత్త బట్టలు ధరించి టపాసులు పేలుస్తూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ దీపావళి పండుగ రోజున గణేశులతోపాటు విష్ణువుని కూడా పూజిస్తారు. దీపావళి పండుగ రోజున ఈ ముగ్గురిని పూజించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఏడాది పాటు సిరిసంపదలు లభించడమే కాకుండా జీవితంలో ఎదురయ్యే విజ్ఞాలన్ని కూడా తొలగిపోతాయని నమ్మకం.
అంతేకాకుండా దీపావళి పండుగ రోజున దానధర్మాలు చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు లభిస్తాయి . అయితే ఈ పండుగ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదు ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
• సాధారణంగా దీపావళి పండుగ రోజున ఇంటికి వచ్చిన అతిథులకు తిరిగి వెళ్లే సమయంలో బహుమతులు కానుకగా ఇస్తూ ఉంటారు . అలాంటి సమయంలో పొరపాటున కూడా గాజు వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు. గాజు వస్తువులను బహుమతిగా ఇవ్వటం వల్ల ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
• అలాగే దీపావళి పండుగ రోజున పెర్ఫ్యూమ్ ని కూడా ఇతరులకు పొరపాటున బహుమతిగా ఇవ్వరాదు. ఇలాంటి వాటిని బహుమతిగా ఇవ్వటం వల్ల మీ జాతకంలో ఉన్న శుక్రుడు బలహీనపడి అనే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
• అలాగే దీపావళి పండుగ రోజున ఇతరులకు పాదరక్షలు కూడా బహుమతిగా ఇవ్వకూడదు. సాధారణంగా కొంతమంది పేదవారికి పాదరక్షలను బహుమతిగా ఇస్తూ ఉంటారు. దీపావళి పండుగ రోజున పాదరక్షలు బహుమతిగా ఇవ్వటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.