దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చిన్నా పెద్ద కులమత బేధాలు లేకుండా ప్రజలందరూ ఎంతో ఆనందంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజున కొత్త బట్టలు వేసుకొని ఇంటిని రంగురంగుల ముగ్గులతో పువ్వులతో అందంగా అలంకరించుకొని మట్టి దీపాలు వెలిగించి అమావాస్య రోజున చీకటి పారద్రోలుతో వెలుగును నింపే ఈ దీపావళి పండుగను కుటుంబ సభ్యులు అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగ రోజున చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ పటాసులు పేలుస్తూ ఉంటారు.
అయితే దీపావళి పండుగ ఎటువంటి విషాదం లేకుండా ఆనందంగా జరిగి పోవాలంటే పండగ రోజున మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి . ఎందుకంటే ఈ పండుగ రోజున ఎక్కడ చూసినా దీపాల కాంతులతో చాలా వెలుగు ఉంటుంది అంతేకాకుండా టపాసులు పేలుస్తూ ఉండటం వల్ల అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల పొరపాటున అగ్ని ప్రమాదం సంభవించిన కూడా ఆ మంటలను అర్పటానికి నీటిని సిద్ధంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా టపాసులు పేల్చే ప్రాంతంలో వాహనాలు ఉండకుండా జాగ్రత్త పడాలి. లేదంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి.
అంతేకాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా పండుగ రోజున కాటన్ దుస్తులను ధరించాలి. టపాసులు పేల్చే సమయంలో పొరపాటున నిప్పురవ్వలు మన మీద పడినా కూడా కాటన్ దుస్తులపై మంటలు తొందరగా వ్యాపించవు. అలాగే పొరపాటున నిప్పు రవ్వలు పడే మంటలు అంటుకుంటే వెంటనే దుప్పటితో మంటలు ఆర్పటానికి దుప్పట్లు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ పండుగ రోజున చిన్న పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. టపాసులు పేల్చటానికి పిల్లలు ఎంతో సంబరపడతారు. అందువల్ల పిల్లల చేతికి టపాసులు ఇచ్చి ఒంటరిగా వాటిని పేల్చటానికి అనుమతించకండి. మీరు కూడా పిల్లలు వెంటే ఉంటూ టపాసులు పెంచటానికి ప్రయత్నం చేయండి.