వీడసలు తండ్రేనా? ( వీడియో)

హైదరాబాద్ జగద్గిరిగుట్ట లెనిన్ నగర్ లో దారుణం జరిగింది. కన్నతండ్రే కొడుకు పాలిట రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. భార్య భర్తల మధ్య గొడవతో ఉన్మాదిగా మారిన శివ అనే వ్యక్తి తొమ్మిది నెలల కొడుకును  ఆటోకేసి కొట్టి పైశాచికత్వం ప్రదర్శించాడు. శివకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో భార్య నిలదీయగా ఆగ్రహాంతో కొడుకును నేలకు, ఆటోకేసి కొట్టి సైకోలా ప్రవర్తించాడు. బాలుడు స్వల్ప గాయాలతో బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలుని పట్ల తండ్రి రాక్షసంగా వ్యవహరించిన వీడియో చూసి అంతా అయ్యో అంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు.