ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న మన తెలుగు నటీమణులు.. ఎవరంటే?

త్రిష తెలుగు, తమిళ సినీ నటీమణి. 1983లో చెన్నైలో జన్మించింది. వర్షం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. అందాల పోటీలలో ఒకసారి మిస్ చెన్నైగా ఎంపికైంది. తర్వాత మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది. మూడు దక్షిణ ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇంకాస్త అందంగా కనబడాలని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.

సమంత తెలుగు, తమిళ భాషలలో నటించిన ఒక భారతీయ నటి. ఈమె 1987లో జన్మించింది. మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించి 2007లో మాస్కోవిన్ కావేరి సినిమా లో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ 2010లో ఏ మాయ చేసావే సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక నాగచైతన్యతో వివాహం జరిగి విడాకులు తీసుకోవడం అందరికీ తెలిసిందే. ఈమె కూడా గ్లామర్ను పెంచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తుంది.

శృతిహాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన నటి, గాయని. ఈమె నటుడైన కమల్ హాసన్ కూతురు. 1986లో చెన్నైలో జన్మించింది. తన తండ్రి సినిమా హే రామ్ లో బాల్య నటిగా నటించింది. 2008లో షారుఖాన్ తో లుక్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తరువాత పలు సినిమాలలో నటించడం జరిగింది. ఈమె కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.

కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటి. ఈమె 1985లో ముంబైలో జన్మించింది. ఈమె మోడలింగ్ చేస్తూ సినీ ఇండస్ట్రీలో తేజ దర్శకత్వం వహించిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసి పాపులర్ హీరోయిన్గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ ఇంకాస్త గ్లామర్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.