ఏంటి.. ఊహ, జీవిత లైఫ్ లు ఒకేలా ఉన్నాయా?

చలనచిత్ర పరిశ్రమలలో హీరోయిన్ గా ఛాన్స్ రావాలంటే అదేమీ చిన్న విషయం కాదు. అదే స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా ఛాన్స్ రావాలంటే ఎన్నో అష్ట కష్టాలు పడితే కానీ సాధ్యం కాదు. అలాంటి అవకాశాలు కొంతమందికి మాత్రమే దక్కుతుంది.

సినిమాలో హీరోల సరసన నటించి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్న నటీనటులు చాలా అరుదుగా ఉంటారు. ఇలా ప్రేమించి రీల్ లైఫ్ లోనే కాక రియల్ లైఫ్ లో కూడా పెళ్లి ద్వారా ఒక్కటైన రెండు నిజ జంటల ప్రేమ.. వివాహం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ రెండు జంటల ప్రేమ కథ ఇంచుమించు ఒకేలా ఉంటుంది.

జీవిత – రాజశేఖర్: 1987లో వచ్చిన తలంబ్రాలు సినిమాలో వీరిద్దరూ కలిసి నటీనటులుగా నటించడం జరిగింది. కానీ మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా జీవితను.. రాజశేఖర్ గారు హీరోయిన్ గా ఒప్పుకోలేదట. తర్వాత కొన్ని కారణాలవల్ల ఇద్దరు కలిసి నటించవలసి వచ్చింది.

ఇక సినిమా షూటింగ్లో వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఇద్దరు కలిసి కొన్ని సినిమాలలో నటించి కుటుంబ సభ్యులు అంగీకరించకపోయినా, కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహ బంధం ద్వారా ఒకటిగా అయ్యి మూడు పూలు ఆరుకాయలుగా వీరి బంధం కొనసాగుతూ ఉంది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం.

ఊహ – శ్రీకాంత్: 1994లో వచ్చిన ఆమె చిత్రంలో వీరిద్దరూ కలిసి నటీనటులుగా నటించడం జరిగింది. శ్రీకాంత్ కూడా మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ గా ఊహను అంటే ఒప్పుకోలేదట. తరువాత వీరిద్దరూ కలిసి నటించడం. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగింది.

వీరు కూడా కుటుంబ సభ్యులు అంగీకరించకపోయినా.. వీరు కూడా కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకోవడం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె సంతానం.