చిత్ర పరిశ్రమలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది కొందరి హీరోయిన్స్ పరిస్థితి. సినిమా అవకాశాల కోసం, కెరీర్లో ముందుకు రాణించాలని వాళ్ల పర్సనల్ లైఫ్ ను కాస్త దూరం పెట్టడం ద్వారా దాని ఫలితం వారి జీవితానికి ఒక తీరని మచ్చల మిగిలిపోయింది. అమ్మ అనే పిలుపుకు నోచుకోలేకపోయారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
రేవతి:ఈమె ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుండే నాటకాల నుండి సినిమాలలోకి ప్రవేశించి తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటిస్తూ గొప్ప పేరు, ప్రతిష్టలు సంపాదించుకుంది. ఇక కెరీర్లో బిజీగా ఉన్న సమయంలో కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయిన సురేష్ చంద్ర మినన్ వివాహం చేసుకుంది.
వివాహం తర్వాత పిల్లలు కావాలనుకుంటే సినిమా అవకాశాలు తగ్గుతాయేమో అని, కాస్త గ్లామర్ కూడా తగ్గుతుందని భావించి కొంతకాలం వరకూ పిల్లలను వద్దనుకుంది. తరువాత కొన్ని రోజులకు మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం ఒంటరిగా ఉంటూ, ఒక పాపను దత్తత తీసుకొని పోషించుకుంటున్నట్లు తెలుస్తుంది.
విజయశాంతి: ఈ హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా కెరియర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన కెరీర్ బిజీగా ఉన్న సమయంలో సహనటుడు సూర్యకిరణ్ వివాహం చేసుకుంది. ఆ తరువాత సూర్య కిరణ్ సినిమాలకు దూరమయ్యాడు. ఈమె ఎక్కువగా డైరెక్టర్ తో క్లోజ్ గా ఉందంటూ ఫేక్ వార్తలు వినిపించాయి. తర్వాత రాజకీయంలో కూడా చురుగ్గా పనిచేస్తున్న విజయశాంతికి ఇంతవరకు పిల్లలు కాలేదు.
హీరోయిన్ శారద: తన గ్లామర్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస అవకాశాలతో ముందుకు సాగుతున్న సమయంలో సహనటుడు చలంను ప్రేమించి వివాహం చేసుకుంది. ఈయనకు ఇంతకుముందే పెళ్లయి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తన గ్లామర్ కోసం పిల్లలను కొంతకాలం వరకూ వద్దు అనుకొని సినిమాలపై దృష్టి సారించగా భర్తకు తనకు మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంది ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతుంది.
జయప్రద: తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు పొంది స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. జయప్రద ప్రొడ్యూసర్ అయినా శ్రీకాంత్ మెహతాను వివాహం చేసుకుంది. అయితే భర్తకు ఇంతకుముందే వివాహం జరిగింది. తరువాత కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకున్నారు. అంత గ్లామర్, మంచి గుర్తింపు ఉన్న అమ్మ అనే పిలుపుకు నోచుకోలేదని చాలా బాధపడుతూ ఉంటుంది.