అపూర్వ తెలుగు సినీ నటి. తెలుగు సినిమాలలో సహాయ పాత్రలలో నటిస్తుంది. ఈమె 1974లో పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు లో జన్మించింది. చిన్నప్పటినుండి నటించాలి అనే ఆసక్తితో 2000 లో అసలు ఏం జరిగింది అనే సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యింది.
కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ తరువాత 2001లో వచ్చిన అల్లరి సినిమా లో సహాయ పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరువాత వరుస అవకాశాలతో పలు సినిమాలలో నటిస్తూ ముందుకు రాణిస్తుంది. గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను బయటపెట్టింది.
సినిమాలలో నటించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ విజయం సాధించే వరకు అనేక రకాల అవమానాలు, పరిస్థితులను ఎదుర్కోవాలి. ఒకసారి మంచి విజయం అందుకున్నాక పరిస్థితులు తారుమారు అవుతాయి. ఒక్కోసారి అవకాశం ఇస్తామని డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్నాక, డేట్స్ ను క్యాన్సల్ చేయడం, కూడా మొఖం తిప్పుకొని వెళ్లిపోవడం లాంటివి ఇండస్ట్రీలో సహజం.
ఇలాంటి పరిస్థితులను చాలావరకు హీరోయిన్లు కూడా ఫేస్ చేసి ఉంటారు. స్టార్ డం గా ఎదిగిన భూమిక, నిత్యామీనన్ ఇంకా శ్రీదేవి లాంటి వాళ్లు కూడా అవకాశాల కోసం ప్రయత్నించడం సక్సెస్ అయిన తర్వాత వారి డేట్స్ కోసం బయట ఎదురు చూడడం జరిగింది. ఒకరకంగా చెప్పాలంటే విజయం సాధిస్తేనే వరుస అవకాశాలు వస్తాయి.
లేకపోతే వచ్చిన అవకాశాలు కూడా వెళ్ళిపోతాయి. ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడం అంటే చాలా కష్టం చాలామంది నటించాలని వచ్చి అవమానాలు ఎదురై వెనక్కి వెళ్లలేక నటించాలంటే అవకాశాలు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉండే పరిస్థితులు బయట వాళ్లకు కనపడవు ఏదో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు అని అనుకుంటారు. ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది అంటూ ఓ ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొంది.