“పుష్ప పార్ట్ 2” లో రష్మికకి విషాదాంతం? కుండ బద్దలుకొట్టిన నిర్మాత.!

పాన్ ఇండియా మార్కెట్ లో తనకంటూ సొంతంగా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా పుష్ప పార్ట్ 2 తో బన్నీ భారీ రెస్పాన్స్ తో రికార్డు వసూళ్లు అందుకున్నాడు. 

మరి ఈ చిత్రానికి సీక్వెల్ ని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేసిన సుకుమార్ ఇక షూటింగ్ లోకి నెక్స్ట్ దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ చిత్రంలో ఒక్కో రోల్ ఎలా ఉంటుంది సుకుమార్ ఎలా చూపిస్తారు అనేది మరింత ఆసక్తిగా మారింది. 

అయితే వీటిలో గత కొన్నాళ్ల నుంచి రష్మిక చేస్తున్న రోల్ శ్రీవల్లిని చంపేస్తారని కొన్ని గాసిప్స్ బయటకి వచ్చాయి. దీనితో ఈ రూమర్స్ మరియు గాసిప్స్ పై ఈ చిత్ర నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ అసలు ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని పూర్తిగా ఈ వార్తలు ట్రాష్, నాన్ సెన్స్ అంటూ స్పందించినట్టు తెలుస్తుంది. దీనితో రష్మిక పాత్రకి ఎలాంటి సాడ్ ఎండింగ్ ఉండదని అందరికీ కుండ బద్దలుకొట్టినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.