వామ్మో.. సిగరెట్ రుచి చూస్తు కెమెరాకు చిక్కిన మెగా డాటర్ నిహారిక!

ఇప్పుడు ట్రెండ్ మారింది. మ‌గాళ్ల‌తో పాటు మ‌హిళ‌లు కూడా అన్ని రంగాల‌లో పోటీ పడుతున్నారు. అది చ‌దువులు, జాబ్స్ విష‌యంలో అనుకుంటే పొర‌పాటే. మ‌ద్యం, స్మోకింగ్‌తో పాటు ఇత‌ర చెడు అల‌వాట్ల విషయంలోను మ‌హిళ‌లు చాలా స్పీడ్‌గా ఉన్నారు. ముఖ్యంగా సెల‌బ్రిటీలు అయితే మందు, స్మోకింగ్ చేసే ఫొటోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వారి వేషాల్ని బాగోతాన్ని చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

మెగా డాట‌ర్ అయిన నిహారిక గురించి అందరకి తెలిసిందే. పెద్ద‌గా సినిమాలు చేయ‌క‌పోయిన ఆమెకు మాత్రం మాములు క్రేజ్ లేదు. ఎందుకంటే ఆమె మెగా ఫ్యామిలీ మెంబర్. అంతే కాకుండా సెలబ్రిటీ కూడా. ముందుగా ఆమెకు వరుసగా సినిమా ఆఫర్స్ రావడంతో సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. కానీ ఆమె చేసిన ప్ర‌తి సినిమా ఫ్లాప్ అయ్యాయి. ఆమె చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్స్ కావ‌డంతో వెబ్ సిరీస్లపై దృష్టి పెట్టింది. ఇక తాను మాత్రం వెబ్ సీరీస్ లతోనే తన నటనను బయటకు తెచ్చింది. వాటి వల్లనే ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది. అందరినుంచి మంచి ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది.

ఆ మధ్యకాలంలోనే ఆమెకు చైతన్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. నిహారిక‌- చైత‌న్య‌ల వివాహం ఘ‌నంగా అంగ‌రంగ వైభవంగా జరిగింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చిరంజీవి, సాయిధ‌ర‌మ్ తేజ్, అల్లు అర్జున్, వైష్ణ‌వ్ తేజ్, వ‌రుణ్ తేజ్‌, నాగ‌బాబుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పెళ్లి వేడుక‌లో పాల్గొని తెగ సంద‌డి చేశారు. పెళ్లికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా చాలా వైరల్ అయ్యాయి.

ఆ మ‌ధ్య ఒక వెబ్ సిరీస్ లాంచ్ కాగా, ఆ కార్య‌క్ర‌మానికి నిహారిక‌తో పాటు ఆమె భ‌ర్త కూడా హాజ‌రు అయ్యారు. క‌రోనా వ‌ల‌న కొంత కాలం ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌కి అంత‌రాయం ఏర్ప‌డడంతో కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది. అయితే సెకండ్ వేవ్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైన ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల తరువాత త‌న భ‌ర్త‌తో క‌లిసి పాండిచ్చేరి వెళ్లింది.

పాండిచ్చేరిలో కొత్త జంట చేసిన సంద‌డికి సంబంధించి ఫొటోలు, వీడియోలు అప్పట్లో చాలా వైర‌ల్ అయ్యాయి. ఆ ఫొటోల‌లో నిహారిక కొత్త లుక్‌లో క‌నిపించే స‌రికి అంతా షాక్ అయ్యారు. కొంద‌రు అయితే లావు అయింద‌ని అంటుంటే మ‌రి కొంద‌రు డీ గ్లామ‌రస్‌గా మారింద‌ని కామెంట్స్ చేశారు.

నిహారిక గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన నెటిజన్లు

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నిహారిక గతంలో ఒక పోస్ట్ చేసింది. ఇందులో ఓ సిగరెట్ ప్యాకెట్‌ను చూపించారు. స్వీట్ సిగరెట్.. అంటూ బాగుందనే ఎమోజీలను షేర్ చేశారు. షూటింగ్ కోసం ఆ స్వీట్ సిగరెట్‌లను నిహారిక తాగినట్టు కనిపిస్తోంది. పెళ్లి త‌ర్వాత నిహారిక స్పీడు మాములుగా లేదంటూ నెటిజ‌న్స్ సెటైర్స్ వేస్తున్నారు.

పెళ్లి తర్వాత సినిమాలు చేయదు అనుకున్నారు అందరు కానీ అందరి అభిప్రాయాలను తలకిందులు చేసింది మెగా కూతురు. అత్త మామలతో పాటు భర్త ప్రోత్సాహంతో ఆమె ఇంకా ఫ్రీడమ్ తో డోస్ పెంచేసిందని చెప్పుకోవాలి. దీనితో నీహారిక వరుసగా వెబ్ సీరీస్ లను నిర్మిస్తూ అలాగే అందులో నటిస్తూ వచ్చింది. అప్పట్లో ఒక మ్యాడ్ హౌజ్ అనే వెబ్ సీరీస్ కోసం అనసూయతో కలిసి నటించిన విషయం అందరికి తెలిసిందే.